AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె ఈ ఇమేజ్ లో దాగివున్న డాగ్ ని కనిపెట్టండి చూద్దాం..!

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఇప్పుడు నెటిజన్లను తెగ అబ్బురపరుస్తోంది. ఒకే దృశ్యంలో నక్కలు, బాతులు మాత్రమే కాకుండా ఓ కుక్క కూడా ఉంది. అయితే దాన్ని మీరు 7 సెకన్లలో గుర్తించగలగాలి. మరీ రెడీనా మీరు అయితే పాల్గొని ప్రయత్నించి చూడండి.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె ఈ ఇమేజ్ లో దాగివున్న డాగ్ ని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion
Prashanthi V
|

Updated on: Apr 22, 2025 | 7:07 PM

Share

మనం గమనించే దృశ్యాలు ఎలా కనిపిస్తున్నాయో కాదు.. మన మెదడు వాటిని ఎలా అర్థం చేసుకుంటుందన్నదే నిజమైన పరిశీలన. ఇలాంటివే ఆప్టికల్ ఇల్యూషన్లు.. మోసం చేసే చిత్రాలు, మన కళ్లను అయోమయంలోకి నెట్టే సన్నివేశాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త ఇల్యూషన్ ఒక్కటి వైరల్ అవుతోంది. మీరు చూస్తున్న ఈ చిత్రంలో నక్క, బాతులు ఉన్నాయి. ఇక్కడే మనకు కనిపించకుండా కుక్క కూడా దాగివుంది. మీ టాస్క్ ఏంటంటే.. కేవలం 7 సెకన్లలో మీరు కుక్కను కనిపెట్టాల్సి ఉంటుంది.

Optical Illusion

బాగా ఫోకస్ చేసి చూడండి.. ఓ నక్క తెల్లటి బాతును నోటిలో పట్టుకొని పరిగెత్తుతుంది. నక్క ఎరుపు జుట్టు, పొడవైన తోక స్పష్టంగా కనిపిస్తాయి. నక్కకు పక్కన మరో రెండు బాతులు ఉన్నాయి.. అవి భయంతో నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇంత వరకూ సాధారణంగా అనిపించిన ఈ చిత్రం. అసలు నిజాన్ని దాచివేస్తోంది. ఎందుకంటే ఆ చిత్రంలో ఎక్కడో ఓ కుక్క చాకచక్యంగా దాగివుంది. మీ కళ్ల పరిశీలనా సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్ ఇది. ఇంకెందుకు ఆలస్యం వెతకండి కుక్కని.

ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న నెటిజన్లు వెంటనే స్పందించసాగారు. కొంతమంది తాము తొందరగా కనిపెట్టానంటూ గర్వంగా కామెంట్లు చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఇంకా దొరకలేదు అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరీ మీరు కనిపెట్టగలరా.. ప్రయత్నించి చూడండి. ఆప్టికల్ ఇల్యూషన్‌లకు ఈరోజుల్లో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇవి సరదాగా ఉండటమే కాకుండా.. మన దృష్టిని పదును పెడతాయి. దృష్టి క్రమబద్ధత, మానసిక ఏకాగ్రత, ఊహాశక్తిని పెంపొందించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.

చాలామంది ఇవి చూసి తమ స్నేహితులకు షేర్ చేస్తారు. నీవూ కనిపెట్టగలవా..? అంటూ చిన్న పోటీలు పెడతారు. ఇది సరదాగా సాగిపోతూ వైరల్ అయ్యేలా చేస్తుంది. కొన్ని ఇల్యూషన్‌లు సోషల్ మీడియాలో రోజుల తరబడి చర్చల్లో నిలుస్తాయి. అదే సమయంలో ఇలాంటి చిత్రాలు మన మెదడు ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి మంచి పాఠంగా మారతాయి. మనం ఏదో ఒకదాన్ని చూస్తున్నామన్న అనుమానం కలిగిస్తాయి.. కాని నిజం వేరేలా ఉండొచ్చు.

సరే అయితే మన టాస్క్ విషయానికి వద్దామా.. ఇంతకీ మీరు కుక్కను కనిపెట్టారా..? కనిపెట్టినవారికి అభినందనలు. కనిపెట్టలేకుంటే మరోసారి బాగా ప్రయత్నించి చూడండి. అయినా కనపడటం లేదంటే చింతించకండి. నేను మీకోసం వెతికిపెట్టాను చూడండి. ఇమేజ్ లో రౌండ్ సర్కిల్ లో కుక్క ఉంది.

Optical Illusion 1