AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్జాగా పెళ్లికొచ్చాడు.. భోజనం చేశాడు.. వెళ్తూ వెళ్తూ.. సంకన పెట్టుకుని వెళ్లిపోయాడు..!

అది గుంటూరు జిల్లా మంగళగిరిలోని మార్కండేయ కల్యాణ మండపం. ఉడతా వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఉడతా వెంకట్రావు తనయుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారంతా వచ్చారు. బంధువులు, స్నేహితులు రాకతో కల్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధువరూలను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు.

దర్జాగా పెళ్లికొచ్చాడు.. భోజనం చేశాడు.. వెళ్తూ వెళ్తూ.. సంకన పెట్టుకుని వెళ్లిపోయాడు..!
Groom's Cash Bag
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 22, 2025 | 6:04 PM

Share

అది గుంటూరు జిల్లా మంగళగిరిలోని మార్కండేయ కల్యాణ మండపం. ఉడతా వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఉడతా వెంకట్రావు తనయుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారంతా వచ్చారు. బంధువులు, స్నేహితులు రాకతో కల్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధువరూలను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు. అటు తర్వాత ఉడతా వెంకట్రావు తరుపున చదివింపులు రాసే వాళ్లు కూర్చుని ఉన్నారు. పెల్లికి వచ్చిన వారిలో ఒకరి దృష్టి చదివింపులు రాస్తున్న వారిపైనే పడింది.

వచ్చిన బంధువులంతా తమ శక్తి కొద్దీ చదివింపులు చదివించి వెళ్తున్నారు. అక్కడే కూర్చొని చదివింపులు రాస్తున్న వారు కూడా బిజి, బిజిగా ఉన్నారు. కొద్దీసేపటి తర్వాత బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. వచ్చిన వారంతా వెళ్లిపోతున్నారు. దీంతో చదింపులు రాసిన వారు ఎంత మొత్తం వచ్చిందో లెక్క కట్టారు. దాదాపు మూడు లక్షల రూపాయల చదివింపులు వచ్చాయి. వాటన్నింటిని బ్యాగ్‌లో సర్థిపెట్టారు. అయితే పెళ్లికి పిలిస్తే వచ్చాడో లేక వృత్తి రీత్యా వచ్చాడో తెలియదు గాని, వచ్చినప్పటి నుండి వీరినే గమనిస్తున్న ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ మూడు లక్షల రూపాయలకు పైగా ఉన్న క్యాష్ బ్యాగ్‌ను పట్టుకు వెళ్లిపోయాడు. అయితే బ్యాగ్ పోయిన విషయం కొద్దిసేపటి తర్వాత తెలుసుకున్న వెంకట్రావు కుటుంబ సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించారు. నేరచరిత్ర ఉన్న వ్యక్తే బ్యాగ్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. బాపట్ల జిల్లాకు అతన్ని పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందం వెళ్లింది. త్వరలోనే అతన్ని పట్టుకొని తీరతామని పోలీసులు అంటున్నారు. శుభకార్యాలు జరిగి కల్యాణ మండపాలకు వచ్చి అక్కడ అందినంత తీసుకుని ఉడాయించే ముఠా పనే ఇది అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో త్వరలోనే నిందితుడిని పట్టుకుని సొమ్ము తిరిగి ఇప్పిమని పోలీసులు హామీ ఇచ్చారని వెంకట్రావు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు దొరుకుతాడో లేదో తర్వాత సంగతి కానీ శుభకార్యాలు జరిగే సమయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
రాఖీకి స్పెషల్.. ఈ కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే చేసేయండి!
రాఖీకి స్పెషల్.. ఈ కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే చేసేయండి!
ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?
ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?
రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..
రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా