Chinese Company Xiaomi: చైనా సంస్థ షావోమి సంచలన నిర్ణయం.. అమెరికా ప్రభుత్వంపై కేసు.. కారణం ఇదే

Chinese Company Xiaomi: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షావోమి తాజాగా కీలక నిర్ణయం...

Chinese Company Xiaomi: చైనా సంస్థ షావోమి సంచలన నిర్ణయం.. అమెరికా ప్రభుత్వంపై కేసు.. కారణం ఇదే
Follow us
Subhash Goud

|

Updated on: Jan 31, 2021 | 5:35 AM

Chinese Company Xiaomi: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షావోమి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కొలంబియా డిస్ట్రిక్ట్‌ కోర్టులో అమెరికా రక్షణ, ట్రెషరీ శాఖలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేసు వేసింది.

అమెరికా డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో విధించిన ఈ నిషేధం నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలోనూ ఇదే విధంగా కొనసాగుతోంది. ఈనెల ప్రారంభంలో ట్రంప్‌ షావోమిని పెంటాగాన్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టేందుకు నిషేధం విధించింది. చైనా మిలటరీతో షావోమికి సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ఆరోపణలను షావోమి గతంలోనే తీవ్రంగా ఖండించింది. తామే కమ్యునిస్టు చైనా మిలటరీ కంపెనీ కాదంటూ తేల్చి చెప్పింది.

అయితే జో బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా ఊరట లభిస్తుందని ఆశించిన షావోమికి నిరాశే ఎదురైంది. ఇక నిషేధం ఎత్తివేసే దిశగా బైడెన్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు వెలువడని కారణంగా ఈ నిషేధాన్ని కోర్టులో సవాలు చేసేందుకు షావోమి నిర్ణయించుకుంది. కమ్యునిస్టు ప్రభుత్వం కంపెనీ అని తమ వర్గీను వర్గీకరించడాన్ని షావోమి తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చట్ట వ్యతిరేకమైన చర్య అని, దీని వల్ల తమ కంపెనీ మళ్లీ కోలుకోలేని విధంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపింది. త్వరలో దీనిపై ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించనున్నాయి.

Also Read: Naxals Surrender: 16 మంది నక్సలైట్ల లొంగుబాటు.. ఇప్పటి వరకు ఎంత మంది లొంగిపోయారో వెల్లడించిన జిల్లా ఎస్పీ