AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని.. శ్రీరాముడి మందిర నిర్మాణానికి మాస్టర్ ఫ్లాన్ రెడీః కేపీ శర్మ

నేపాల్ ప్రధాని మరోసారి శ్రీరాముని జన్మస్థలం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లోని బీర్‌గంజ్ సమీపంలో నిజమైన అయోధ్య ఉందని గతంలో ఓలి పేర్కొన్నారు.

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని.. శ్రీరాముడి మందిర నిర్మాణానికి మాస్టర్ ఫ్లాన్ రెడీః కేపీ శర్మ
Nepal pm kp sharma oli
Balaraju Goud
|

Updated on: Jan 31, 2021 | 8:49 AM

Share

Nepal PM controversial comments : శ్రీరాముడు, అయోధ్యపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముని జన్మస్థలం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లోని చిత్‌వన్‌లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. నేపాల్‌లో శ్రీరాముని జన్మస్థలంలో మందిర నిర్మాణ పనులు మొదలయ్యాయన్నారు. నేపాల్‌లోని బీర్‌గంజ్ సమీపంలో నిజమైన అయోధ్య ఉందని గతంలో ఓలి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. తాజాగా ఓలి వ్యాఖ్యలపై ఇటు భారత్‌లోనూ, అటు నేపాల్‌ రాజకీయ నాయకులు సైతం ఫైర్ అవుతున్నారు.

తాజాగా ఓలి.. అయోధ్యాపురిలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతున్నదని అన్నారు. శ్రీరాముని విగ్రహాన్ని ఇంతకుముందే రూపొందించారన్నారు. సీతామాత విగ్రహం రూపుదిద్దుకుంటున్నదని వెల్లడించారు. వచ్చే ఏడాది శ్రీరాముని జన్మస్థలి అయోధ్యాపురిలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా మారుస్తామని పేర్కొన్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై భారతీయులు మండిపడితున్నారు. ఓలీ చైనా చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. ఆ దేశం చెప్పినట్లుగా ఆయన మాట్లాడుతూ భారత్‌పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. తొలుత మ్యాపుల వివాదాన్ని లేవనెత్తారని, ఇప్పుడు శ్రీరాముడ్ని కూడా ఇరు దేశాల వివాదంలోకి లాగుతున్నారు నేపాల్ ప్రధాని ఓలి. భారత్‌లోని అయోధ్య నకిలీదని, శ్రీరాముడు పుట్టిన అసలైన అయోధ్య నేపాల్‌లో ఉన్నదని, శ్రీరాముడు భారతీయుడు కాదు నేపాలీస్ అంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.

సరయూ నది అయోధ్యకు సమీపంలో ప్రవహిస్తున్నదని, నేపాల్‌లో ఎక్కడా ఆ పేరుతో ఎలాంటి నది లేదని శివసేన గుర్తు చేసింది. రామజన్మభూమి కోసం కరసేవకులు ఆ నదిలో తమ రక్తాన్ని పారించారని పేర్కొంది. సుమారు 75 ఏండ్లుగా రామజన్మభూమి ఉద్యమం జరుగుతున్నదని, ఓలీ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని శివసేన ప్రశ్నించింది. అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించిన బాబర్ కూడా నేపాలీస్ అని చెబుతారా అని ఎద్దేవా చేసింది. భారత్, నేపాల్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను మరిచిన ఓలీ తన ప్రధాని పదవిని కాపాడుకునేందుకు చైనాకు బానిసగా మారారని శివసేన విమర్శించింది.

Read Also.. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయమే టార్గెట్‌గా భారీ విధ్వంసానికి కుట్ర… పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు..!