AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Acquires Land: జిత్తులమారి చైనాకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న భారత్‌

Indian Army Acquires Land: చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొంత భూమిని ...

Indian Army Acquires Land: జిత్తులమారి చైనాకు చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న భారత్‌
Subhash Goud
|

Updated on: Jan 31, 2021 | 5:33 AM

Share

Indian Army Acquires Land: చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొంత భూమిని భారత్‌ దేశ రక్షమంత్రిత్వశాఖ సేకరించింది. చైనా చొరబాట్లను నిరోధించేందుకు ఈ భూమిలో మిలటరీ గారిసన్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఎల్‌ఏసీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోర్ని-2గ్రామంలోని భూమిని రక్షణ మంత్రిత్వశాఖ సేకరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వెస్ట్‌ సియాంగ్‌ జిల్లాలో ఉన్న ఈ గ్రామం .. ఇక్కడ సేకరించిన భూమిలో మిలటరీ గారిసన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

సామ్రాజ్యవాద కాంక్షతో యథేచ్చగా వ్యవహరిస్తున్న చైనాను ధీటుగా తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. న్యింగ్‌చిలో మౌలిక సదుపాయాలను చైనా పెంచుతోంది. చైనాను ఎదుర్కొనడానికి భారత్‌ సర్కార్‌ ఈ భూమిని సేకరించింది.

గ్రామసభ సమావేశం అవసరం లేకుండా రక్షణ, రైల్వేలు, కమ్యూనికేషన్ల కోసం భూమిని సేకరించే అధికారం భూ సేకరణ పునరావాసం, పునః పరిష్కారంలో న్యాయమైన నష్టపరిహారం, పారదర్శకత చట్టం, 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ భూమిని సేకరించేందుకు సముచిత అధికార వ్యవస్థగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Naxals Surrender: 16 మంది నక్సలైట్ల లొంగుబాటు.. ఇప్పటి వరకు ఎంత మంది లొంగిపోయారో వెల్లడించిన జిల్లా ఎస్పీ

Follow Us
'RGV లేకపోతే నా లైఫ్ లేదు.. అది వైరస్‌లా పని చేసింది' IPS అక్షయ్
'RGV లేకపోతే నా లైఫ్ లేదు.. అది వైరస్‌లా పని చేసింది' IPS అక్షయ్
నీటి చుక్క పడితే చీమలు వస్తాయ్.. వెంకన్నకు అభిషేకమే చెయ్యని..
నీటి చుక్క పడితే చీమలు వస్తాయ్.. వెంకన్నకు అభిషేకమే చెయ్యని..
కుబేర మూవీలో బిచ్చగత్తెగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.?
కుబేర మూవీలో బిచ్చగత్తెగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.?
బ్యాంక్ అకౌంట్లో ఈ తప్పులు చేస్తున్నారా..? 60 రోజుల పాటు బ్లాక్..
బ్యాంక్ అకౌంట్లో ఈ తప్పులు చేస్తున్నారా..? 60 రోజుల పాటు బ్లాక్..
RRB రైల్వేలో 4,029ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
RRB రైల్వేలో 4,029ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
విజయ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రెడీ అవుతున్న వినాయకుడు
విజయ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి రెడీ అవుతున్న వినాయకుడు
గణపతి పూజకు కావాల్సిన సామగ్రి ఇదే.. ఏవి సమర్పించకూడదో తెలుసా?
గణపతి పూజకు కావాల్సిన సామగ్రి ఇదే.. ఏవి సమర్పించకూడదో తెలుసా?
ఆ హీరోయిన్ ఒక్కరినే గ్లామర్ కోసం కాకుండా గౌరవంతో చూశా..
ఆ హీరోయిన్ ఒక్కరినే గ్లామర్ కోసం కాకుండా గౌరవంతో చూశా..
ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC
ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC
Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ..
Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ..