Naxals Surrender: 16 మంది నక్సలైట్ల లొంగుబాటు.. ఇప్పటి వరకు ఎంత మంది లొంగిపోయారో వెల్లడించిన జిల్లా ఎస్పీ

Naxals Surrender: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరిపై లక్ష చొప్పున రివార్డు ఉన్నట్లు..

Naxals Surrender: 16 మంది నక్సలైట్ల లొంగుబాటు.. ఇప్పటి వరకు ఎంత మంది లొంగిపోయారో వెల్లడించిన జిల్లా ఎస్పీ
Follow us

|

Updated on: Jan 30, 2021 | 11:25 PM

Naxals Surrender: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరిపై లక్ష చొప్పున రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం లోన్‌ వర్రాటు అనే పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. వారు ఆచరించే ‘హలో’ భావజాలంపై అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా, గత సంవత్సరం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 288 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చారని అన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయంగా రూ. 10 వేలు అందించామని ఎస్పీ పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈ పునరావాస కార్యక్రమంలో భాగంగా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తామని, లోన్‌ వర్రాటు కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు నక్సలైట్లకు చెందిన అన్ని గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశామని ఎస్పీ అభిషేక్‌ వెల్లడించారు.

Also Read: Strain Virus: యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పరీక్షల్లో నెగెటివ్‌ తేలితే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు