44 ఏళ్ళ పాటు డైరెక్టర్ గా బిల్ గేట్స్ ప్రస్థానం.. కరోనాపై పోరాటమే ఇక ధ్యేయం

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చివరకు తప్పుకున్నారు. 1976 మార్చి 13 న తన సంస్థ పబ్లిక్ కంపెనీ అయినప్పటి నుంచీ (అప్పట్లో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే) డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతూ వచ్చారు.

44 ఏళ్ళ పాటు డైరెక్టర్ గా బిల్ గేట్స్ ప్రస్థానం.. కరోనాపై పోరాటమే ఇక ధ్యేయం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 14, 2020 | 11:47 AM

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చివరకు తప్పుకున్నారు. 1976 మార్చి 13 న తన సంస్థ పబ్లిక్ కంపెనీ అయినప్పటి నుంచీ (అప్పట్లో ఆయన వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే) డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతూ వచ్చారు. సరిగ్గా 2020 మార్చి 13 నే ఆయన తప్పుకోవడం విశేషం. తన నిర్ణయానికి దారి తీసిన కారణాలను ఆయన క్లుప్తంగా లింక్డ్ ఇన్ పోస్టులో వివరించారు. ‘బెర్క్ షైర్ హాథ్ వే బోర్డు నుంచి వైదొలగుతున్నా.. గ్లోబల్ హెల్త్, (ఆరోగ్యం), అభివృధ్ది, విద్య వంటి రంగాలకు ధార్మిక కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. అలాగే క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) పై నా ఎంగేజ్ మెంట్స్ పెరుగుతున్న కారణం కూడా ఒకటి’ అని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్-19 (కరోనా) పై ప్రపంచ దేశాలు పోరాడుతున్న సమయంలో బిల్ గేట్స్ తీసుకున్న ఈ టైమింగ్ కూడా చెప్పుకోదగినది. డైరెక్టర్ల బోర్డు నుంచి తను వైదొలగున్నంతమాత్రాన..మైక్రో సాఫ్ట్  సంస్థకు దూరం కావడంలేదని, తన జీవిత కాలంలో ఈ సంస్థ ప్రస్థానం అతి ముఖ్యమైనదని ఆయన అన్నారు. సత్య నాదెళ్లకు సదా నేను సహకరిస్తూనే ఉంటానని, అలాగే డైరెక్టర్ల బోర్డుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

సీఈఓ సత్య నాదెళ్ల  నేతృత్వంలో మైక్రో సాఫ్ట్ ట్రిలియన్ డాలర్ల కంపెనీగా కొనసాగుతోంది. బిల్ గేట్స్ హయాంలో ఎన్నడూ చేరుకోని   మార్కెట్ వాల్యూని సత్య హయాంలో చేరుకుంది. అయితే డైరెక్టర్ల బోర్డు నుంచి బిల్ గేట్స్ వైదొలగడం సంస్థకు కొంత హానికరమేనన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. 2008 లో ఫుల్ టైమ్ డైరెక్టర్ హోదాను పక్కన పెట్టినప్పటికీ.. తన సంస్థను అగ్ర స్థానంలో నిలపడానికి గెట్ చేసిన కృషి అపారం. కంపెనీ షేర్లలో ఆయనకు ఇప్పటికీ 1.3 శాతం వాటాలున్నాయి. ఇవి సుమారు 16 బిలియన్ డాలర్ల విలువైనవి. కాగా; కరోనా వైరస్ నివారణకు ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములవుతామని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇందుకు 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణకు పరిశోధకులు చేస్తున్న కృషికి  తమ సహాయం ఉంటుందని, వ్యాక్సీన్ తయారీకి అయ్యే ఖర్చును తాము ప్రకటించిన విరాళం నుంచి అందుకోవచ్ఛునని ఈ సంస్థ స్పష్టం చేసింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!