గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సీన్ దొరికేసిందోచ్..

Coronavirus Scare: చైనాలోని వుహన్‌లో పుట్టిన కరోనా వైరస్… అక్కడి పట్టణాలు, నగరాలను వణికించడమే కాకుండా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సుమారుగా 5 వేల మంది ప్రజలు ఈ కొవిడ్- 19 కారణంగా ప్రాణాలు విడిచారు. తాజాగా కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించి…ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ ముందుస్తు చర్యలు చేపట్టాయి. ఇక ఈ వ్యాధికి ఇప్పటివరకు మెడిసిన్‌ను కనుగొనలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు అయితే […]

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సీన్ దొరికేసిందోచ్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 14, 2020 | 9:07 PM

Coronavirus Scare: చైనాలోని వుహన్‌లో పుట్టిన కరోనా వైరస్… అక్కడి పట్టణాలు, నగరాలను వణికించడమే కాకుండా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సుమారుగా 5 వేల మంది ప్రజలు ఈ కొవిడ్- 19 కారణంగా ప్రాణాలు విడిచారు. తాజాగా కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించి…ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ ముందుస్తు చర్యలు చేపట్టాయి. ఇక ఈ వ్యాధికి ఇప్పటివరకు మెడిసిన్‌ను కనుగొనలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఆ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కరోనాను నియంత్రించగలిగే వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కెనడాకు చెందిన ఓ సంస్థ ప్రకటించింది.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న…కొవిడ్- 19 వైరస్‌కు వ్యాక్సిన్‌ తమ దగ్గర ఉన్నట్లు కెనడాకు చెందిన మెడికాగొ కంపెనీ స్పష్టం చేసింది. వైరస్ జన్యు నిర్మాణం లభించిన 20 రోజుల్లోనే వ్యాక్సిన్‌ను తయారు చేశామని ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరికొత్త సాంకేతికత సాయంతో రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఎఫ్‌డీఏ అనుమతి కోసం పంపినట్లు తెలిపారు.

మెడికాగో సీఈఓ బ్రూస్ క్లార్క్ మాట్లాడుతూ.. రెగ్యులేటరీ అడ్డంకులు గనక తొలిగిపోతే తమ సంస్థ నెలకు 10 మిలియన్ మోతాదుల మెడిసిన్‌ను ఉత్పత్తి చేయగలదని చెప్పారు. అంతేకాకుండా నవంబర్ 2021 నుంచి ఈ మందు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయిల్‌కు చెందిన ఓ పరిశోధనశాల కూడా కరోనాకు మందు కనిపెట్టినట్లు పేర్కొంది. అయితే క్లార్క్ మాత్రం ఇజ్రాయిల్ ప్రయోగశాల ఉపయోగించిన టెక్నాలజీని తాము సీజనల్‌గా వచ్చే ఫ్లూ వ్యాధులను నియంత్రించడం కోసం ఎప్పుడో ఉపయోగించామని తెలిపారు.

ఇక మరికొంతమంది అయితే ఆర్ఎన్ఏ, డీఎన్ఏల ద్వారా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేశారని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వ్యాధిని నియంత్రించేందుకు తయారైన వాక్సిన్ సక్సెస్ అయినట్లు దాఖలాలు లేవు. అయితే క్లార్క్ టీమ్ ఇంత వేగంగా ఎలా వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారన్నది ప్రశ్న. దానికి సమాధానం వాళ్లు కోడిగుడ్లకు బదులు మొక్కలను బయో రియాక్టర్‌గా ఉపయోగించడం జరిగింది.

సాధారణంగా వ్యాక్సిన్స్ తయారీలో గుడ్లను వాడతారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. సమయం కూడా అధికంగా పడుతుంది. అంతేకాకుండా గుడ్లలోకి వైరస్‌ను పంపి టెస్టులు చేస్తారు. అయితే మెడికాగో సంస్థ లైవ్ వైరస్‌తో పనిచేయదు. గత పదేళ్లుగా ఈ సంస్థ మొక్కలను ఉపయోగిస్తూ వ్యాక్సిన్ ప్రోటీన్లను వృద్ధి చేస్తూ వస్తోంది. ఈ ప్రక్రియలో జెనెటిక్ సీక్వెన్స్‌ను అగ్రోబ్యాక్తీరియం అనే మట్టి బ్యాక్తీరియాలోకి పంపుతారు. దీని వల్ల మొక్కలు వ్యాక్సిన్‌గా వాడే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి.

కోవిడ్ 19 లాంటి వైరస్‌ వ్యాప్తి చెందితే కొత్త మొక్కలను ఉపయోగించి ప్రక్రియను అప్డేట్ చేయవచ్చు. ఈ విధంగానే తమ పరిశోధనకు, గుడ్లతో చేసే ప్రక్రియకు మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. తాము వైరస్‌ను వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్‌ లేదా యాంటీ బాడీలను ఉత్పత్తి  చేస్తామని క్లార్క్ అన్నారు.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..