కోవిడ్ ఎఫెక్ట్, ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు ? పీఎం స్కాట్ మారిసన్

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా కూడా భయపడుతోంది.  భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించే యోచన ఉందని ఈ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ సూత్రప్రాయంగా తెలిపారు.

కోవిడ్ ఎఫెక్ట్, ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు ? పీఎం స్కాట్ మారిసన్
Scott Morrison
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 22, 2021 | 6:12 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో ఆస్ట్రేలియా కూడా భయపడుతోంది.  భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించే యోచన ఉందని ఈ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ సూత్రప్రాయంగా తెలిపారు. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చే విమానాల సంఖ్యను కుదిస్తామని ఆయన అన్నారు. ఇండియాతో బాటు రెడ్ జోన్లుగా ముద్ర పడిన ఇతర దేశాల నుంచి వచ్చే ప్లేన్ల విషయంలో కూడా ఇదే విధమైన చర్య తీసుకుంటామన్నారు. తాము చేపట్టే కొత్త ఆంక్షల గురించి మరో 24 గంటల్లో ప్రకటిస్తామని నేషనల్ కేబినెట్ సమావేశానంతరం ఆయన మీడియాకు చెప్పారు. కొత్త ఆంక్షల ప్రకారం.. ఇండియా నుంచి నేరుగా సిడ్నీకి వచ్చే విమానాలను 30 శాతం  తగ్గించివేస్తారు. కోవిడ్ గ్లోబల్ పాండమిక్ మధ్యలో మనం ఉన్నామని, అయితే ఈ సంక్షోభ సమయమంతా తమ ప్రభుత్వం సక్సెస్ ఫుల్ చర్యలు తీసుకుందని స్కాట్ పేర్కొన్నారు.ఇండియాను బ్రిటన్ రెడ్ లిస్టులో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్రిటన్ తరహా మెకానిజాన్ని తాము కూడా పాటించే యోచన ఉందన్నారు.

తమ దేశంలో కరోనా వైరస్ కేసులను అదుపు చేసేందుకు వ్యాక్సిన్ కోసం గత ఏడాది ఇండియాను ప్రాధేయపడిన స్కాట్ మహాశయుడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. తమను నాడు ఆదుకున్న ఇండియా ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నందుకు ఆయన కనీసం సానుభూతి అయినా వ్యక్తం చేయలేదు. నాడు తాను కోవిడ్ బారిన పడినప్పుడు ఇండియాను దీనంగా బతిమాలిన ఆయన.. ఇప్పుడు ఇండియా అంటే భయపడుతున్నాడు. ఒకప్పుడు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పిన స్కాట్ మారిసన్ గతం మర్చిపోయాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్ లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ు ఎప్పుడంటే….! విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వివరణ

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ