Omicron: ఆస్ట్రేలియాను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. కరోనా కొత్త వేరియంట్‌ తొలి మరణం నమోదు..

Australia Records First Omicron Death: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి

Omicron: ఆస్ట్రేలియాను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. కరోనా కొత్త వేరియంట్‌ తొలి మరణం నమోదు..
Omicron
Follow us

|

Updated on: Dec 27, 2021 | 12:00 PM

Australia Records First Omicron Death: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోంది. యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌ విజృంభణ మొదలైంది. ఆస్ట్రేలియాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. కరోనా వేరియంట్‌తోపాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ వృద్ధుడికి ఇటీవల ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందని.. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడని ఆస్ట్రేలియా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యక్తికి వృద్ధుల సంరక్షణా కేంద్రంలో ఈ వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. అయితే.. పూర్తి వివరాలను వెల్లడించిందుకు అస్ట్రేలియా అధికారులు నిరాకరించారని మీడియా వెల్లడించారు.

కాగా.. ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణతో ఇప్పటికే పలుమార్లు లాక్‌డౌన్లు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఒక వ్యక్తి మృతి చెందడంతో మళ్లీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. దీంతోపాటు రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయని.. ఆంక్షలు విధించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ వృద్ధుడి మరణంపై ఎపిడమాలజిస్టు క్రిస్టియన్‌ సెల్వే మాట్లాడుతున్న వీడియోను ఆస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసింది.

కాగా.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌, విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్‌ సహా పలు ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే 9,107 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read:

Viral Video: నాతోనే గేమ్సా.. వేటాడేందుకు వచ్చిన పులితో దాగుడుమూతలు ఆడిన బాతు..! వీడియో వైరల్

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో చైనా వ్యూహం పని చేయదు.. కీలక ట్విట్‌ చేసిన దక్షిణాఫ్రికా వైరాలజిస్ట్‌