Hilarious Viral Video: ప్యాంట్ లేకుండా.. షార్ట్స్ వేసుకొని వార్తలు చదివిన యాంకర్..! ఎందుకో చెప్పుకొచ్చిన…
Anchor Wears Shorts: ప్రఖ్యాత న్యూస్ చానెల్ లైవ్ కార్యక్రమంలో ప్యాంట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చాడు ఓ న్యూస్ యాంకర్. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్...
“ఊహలు గుసగుసలాడే” సినిమాలో పోసాని చెప్పిన ఫేమస్ డైలాగ్.. మీకు గుర్తుందా… “న్యూస్ చదవడానికి ప్యాంట్ కాదు ముఖ్యం.. గుండెల్లో ధైర్యం” ఈ డైలాగ్ దేశాలు కాదు… ఖండాంతరాలు దాటినట్లుగా కనిపిస్తోంది. ఓ ప్రముఖ ఛానల్ యాంకర్ అచ్చు ఇదే ఫాలో అయ్యాడు. వార్తలు చదువుతున్నప్పుడు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది లే.. అని అనుకన్నట్లున్నాడు. ప్యాంట్ లేకుండా కేవలం సూట్‌తో వార్తలు చదవేశాడు. కానీ చివరి ఫ్రేమ్‌లో దొరికిపోయాడు.
ప్రఖ్యాత న్యూస్ చానెల్ లైవ్ కార్యక్రమంలో ప్యాంట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చాడు ఓ న్యూస్ యాంకర్. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతోంది. దీంతో ఆ ఛానల్‌పై పెద్ద ఎత్తున మీమ్స్, కామెడీ ట్యాగ్స్ ఇలా చాలా చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుండటంతో ఆ ఛానల్ అభిమానులు మాత్రం ఇది అలా కాదు అంటూ ఏవో సాకులు మొదలు పెట్టారు.
వారు చెప్పిన కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి… “బుధవారం నాడు బ్రిటన్‌లో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ఆ రోజు లైవ్ న్యూస్ చదువుతున్న షాన్ లే అనే యాంకర్.. ప్యాంట్ లేకుండా షార్ట్స్ వేసుకొని ప్రోగ్రాం నిర్వహించాడు. అంటూ వెనుకేసుకొచ్చారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
ఆ రోజు ఏం జరిగిందంటే…
యాంకర్ షాన్ లే మాత్రం పైన కోటు, టై ధరించి.. కింద మాత్రం షార్ట్స్(నెక్కర్) వేసుకొని ఉన్నాడు. అద్భుతమైన వార్తలను ప్రేక్షక ప్రపంచానికి అందించాడు. కానీ వార్తల ముగింపులో.. కెమెరా వైడర్ వ్యూ కోసం ప్యాన్ చేసినప్పుడు దీన్ని ప్రేక్షకులు గమనించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
@cristo It’s the Shaun Ley story …. #cluesonthenews pic.twitter.com/ITNbm1DUcb
— R⚽️ger Williams (@roger_lfc) June 4, 2021
Did someone forget to tell BBC newsreader Shaun Ley that it wasn’t a Zoom call? pic.twitter.com/xHA0zfNzXs
— Eddie Burfi (@EddieBurfi) June 4, 2021
Do you think on the UK’s hottest day of the year that he said “I’m Shaun Ley” or “I’m wearing shorts today”? #hottestday #bbcnewscast #bbc pic.twitter.com/h7xEajWSAc
— Kevin Bellwood (@kevinbellwood) June 4, 2021
BBC newsreader Shaun Ley yesterday: formal above the desk, more casual below. pic.twitter.com/pl9p31ihvw
— Martin Ingram (@martiningram) June 4, 2021