AP Gurukulam Notification: ఏపీ గురుకులం స్కూల్స్‌ 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధారణ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

AP Gurukulam Notification: ఏపీ గురుకులం స్కూల్స్‌ 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
Ap Gurukulam Students
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 06, 2021 | 11:20 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధారణ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్‌.ప్రసన్నకుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎం.ఆర్ ప్రసన్నకుమార్ తెలిపారు.

ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి, ఎంపికైన వారికి కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాల కేటాయింపు చేపడతారు.

గుంటూరు జిల్లాలోని తాడికొండ, అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్ళితో సహా మిగిలిన పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభంకాగా, ఈనెల 30 వరకు ‘హెచ్‌టీటీపీఎస్‌.ఏపీఆర్‌ఎస్‌. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాటరీ పద్ధతి ద్వారా జూలై 14న అర్హులను ఎంపిక చేస్తారు.

https://aprjdc.apcfss.in/ లేదా https://apreis.apcfss.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్లలోనే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

ప్రవేశానికి అర్హతలు..

  1. ఓ.సీ, బీ.సీలకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్‌ 1 నుంచి 2012 ఆగస్టు 31మధ్య పుట్టి ఉండాలి. ∙ఎస్సీ, ఎస్టీలు 2008 సెప్టెంబర్‌ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి.
  2. చదువు..: అభ్యర్థులు జిల్లాలో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు చదివి ఉండాలి.
  3. ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి.
  4. గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
  5. అభ్యర్థి తల్లి, తండ్రి, సంరక్షకుల 2020–21 ఆర్థిక సంవత్సరాదాయం రూ .1,00,000 మించరాదు.

ఇవి కూడా చదవండి: Tirumala heavy rain: తిరుమలలో ఎడతెరపిలేని వర్షం.. మొదటి ఘాట్ రోడ్డులో నేల కూలిన వృక్షం

విశాఖ ఖాకీల జులుం.. ప్రశ్నించినందుకు యువతిపై విచక్షణ రహితంగా దాడి