Anandaiah: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు… రేపటి నుంచి మందు పంపిణీ చేస్తానంటున్న ఆనందయ్య..
రాజకీయ దుమారం కొనసాగుతోంది. సర్కార్ అనుమతి ఇచ్చినా.. ఆనందయ్య మందుపై ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. సోమవారం ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందా..! ఉండదా...! అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.
ఆనందయ్య పంపిణీ ఇప్పుడు రాజకీయ సెగలు పెట్టిస్తోంది. రాజకీయ దుమారం కొనసాగుతోంది. సర్కార్ అనుమతి ఇచ్చినా.. ఆనందయ్య మందుపై పంపిణీపై ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. సోమవారం ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందా..! ఉండదా…! అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అనుకున్న సమయానికి మందు పంపిణీ సాధ్యం కాదంటున్న ఆనందయ్య శిశ్యుడు సంపత్.. అయితే తప్పనిసరిగా మందు పంపిణీ ఉంటుందని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య స్పష్టం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య మందు పంపిణీపై సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది. మందు పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్ ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది.
మందు అమ్మకానికి వెబ్‌సైట్ తయారిలో నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ హస్తం ఉందని.. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోట్లు కొట్టేద్దామని చూస్తున్నారని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్ర చేశారని కూడా కామెంట్ చేశారు.
అయితే సోమిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆనందయ్య. మందు పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేదని ఆనందయ్య పేర్కొన్నారు. ఈ విషయంపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. తెలంగాణ నుంచి యాదవ సంఘం వారు వచ్చి పరిశీలించి అభినందనలు తెలిపారని…. వారిపై లాఠీఛార్జి చేసినట్లు సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. వివాదాల్లోకి లాగకుండా ప్రజల సేవచేయడంలో సహకారం అందించాలని ఆనందయ్య కోరారు.