చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి పుట్టిందే కోవిద్-19 వైరస్……పూణే శాస్త్రజ్ఞుల జంట ధ్రువీకరణ

చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కోవిద్19 వైరస్ పుట్టిందని, ఇందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని పూణేకు చెందిన భార్యాభర్తల జంట చెబుతున్నారు. డా. మోనాలీ రహల్కర్, డా. రాహుల్ బహులికర్ అనే ఈ కపుల్..శాస్త్రజ్ఞులు కూడా..కోవిద్ వైరస్ పుట్టుక గురించి...

చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి పుట్టిందే కోవిద్-19 వైరస్......పూణే శాస్త్రజ్ఞుల జంట ధ్రువీకరణ
How A Pune Based Scientist Couple Linked Origin Of Covid 19 To Mojiang Chinese Minors
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 06, 2021 | 4:57 PM

చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కోవిద్19 వైరస్ పుట్టిందని, ఇందుకు తమవద్ద ఆధారాలు ఉన్నాయని పూణేకు చెందిన భార్యాభర్తల జంట చెబుతున్నారు. డా. మోనాలీ రహల్కర్, డా. రాహుల్ బహులికర్ అనే ఈ కపుల్..శాస్త్రజ్ఞులు కూడా..కోవిద్ వైరస్ పుట్టుక గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోందని, తాము కూడా ఇప్పుడు దీనిపై స్పందించ దలిచామని వీరు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సార్స్ కరోనా వైరస్-2 లక్షణాలు కలిగిన ఆర్ఏటీ-13 వైరస్ పై పరిశోధనతో గతంలో తాము రీసర్చ్ మొదలుపెట్టామని వీరు తెలిపారు. 2012 లో సౌత్ చైనాలోని మొజియాంగ్ లో గల రాగి గనిలో ఎవరో వదిలేసిన డాక్యుమెంట్లను తాము కనుగొన్నామని.. దాదాపు నిర్మానుష్యంగా ఉన్న ఆ గనిలో ఆరుగురు కార్మికులు గనిని శుభ్రం చేస్తూ కనిపించారన్నారు. ఆ గని అంతా గబ్బిలాలు వదిలేసిన వ్యర్థాలతో (రెట్టలతో) నిండిపోయిందన్నారు. ఆ వ్యర్థాలను టచ్ చేయగానే డస్ట్ గా మారిపోయిందని, వాటిపై నడిస్తే ఎండిపోయిన పెల్లెట్స్ లా మారి పేలిపోయాయని, ఇది గాలిలో కలిసిపోయి దుర్గంధం వంటిది వ్యాపించిందన్నారు. ఈ గాలిని పీల్చినప్పుడు ఎలర్జిక్ లక్షణాలు కలిగాయన్నారు. ఆ వ్యర్థాల కారణంగా ఆ ఆరుగురు కార్మికులు తీవ్రంగా అస్వస్థులయ్యారని డా. రహల్కర్ తెలిపారు. జ్వరం, దగ్గు, బ్లడ్ క్లాట్ వంటి వాటితో బాధ పడ్డారని, చివరకు వారిలో ముగ్గురు మరణించారన్నారు.ఈ లక్షణాలన్నీ ఇప్పుడు కోవిద్ రోగులు అనుభవిస్తున్న లక్షణాలే అని వారు చెప్పారు. విపరీతమైన అలసట, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా చేరడం వంటి రుగ్మతలకు వారు లోనయ్యారని తెలిపారు. ఆ కార్మికుల సీటీ స్కాన్ లు కూడా కోవిద్ రోగుల స్కాన్ లను పోలి ఉన్నాయని రహల్కర్ చెప్పారు.

తాము మొజియాంగ్ గని నుంచి సేకరించిన సార్స్ వైరస్ ను విశ్లేషించి 2020 మే నెలలో ఓ చిన్న డాక్యుమెంటును ప్రచురించామని డా.రాహుల్ బహులికర్ తెలిపారు. ఓ ట్విటర్ యూజర్ కూడా సంబంధిత డాక్యుమెంట్లను విశ్లేషించి తమ అభిప్రాయాలతో ఏకీభవించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం కోవిద్ రోగులకు ఇస్తున్న యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందుల వంటివే నాడు ఆ గని కార్మికులకు కూడా ఇచ్చారన్నారు. గబ్బిలాల వ్యర్థాలపై వూహాన్ ల్యాబ్ లో పరిశోధనలు జరిగాయన్నారు. అంటే ఈ ల్యాబ్ కి దూరంగా ఉన్న ఎనిమల్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టిందని చెప్పడానికన్నా ఈ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందని చెప్పవచ్చు అని వారు పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video

కరోనా మిగిల్చిన కన్నీటి కథలు..అంతులేని వ్యధలు కరొనతో పోరాడలేక అలిసిపోయి ఊడిపోతున్న కుటుంబాలు ఎన్నో..:Corona Pandemic Live Video

మనిషి నవ్వును అనుకరిస్తున్న పక్షులు..నెటింట్లో వైరల్ అవుతున్న వీడియో.నెటిజన్లు ఫిదా :Laughing Birds Video.

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!