AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: మనవాళిపై పగబట్టిన ప్రకృతి.. ఇండోనేషియా సహా మరోసారి టర్కీలో భారీ భూకంపం.. వణికిన ప్రజలు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. USGS ప్రకారం, ఈ భూకంపం టొబెలోకు ఉత్తరాన 177 కి.మీ. భూకంప కేంద్రం 99 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది.

Earthquake: మనవాళిపై పగబట్టిన ప్రకృతి.. ఇండోనేషియా సహా మరోసారి టర్కీలో భారీ భూకంపం.. వణికిన ప్రజలు
Earthquake
Surya Kala
|

Updated on: Feb 24, 2023 | 7:07 AM

Share

భూకంపాలు, వర్షాలు, వరదలు, మంచు తుఫాన్లు ఇలా రకరకాలుగా ప్రకృతి వివిధ దేశాల్లో భీభత్సం సృష్టిస్తూనే ఉంది. దీంతో  మానవాళిపై ప్రకృతి పగబట్టిందా అనిపిస్తోంది.. ఓవైపు టర్కీ, సీరియల్లో భూకంపం సృష్టించిన విధ్వసం నుంచి తేరుకోకముందే..  తాజాగా  ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. USGS ప్రకారం, ఈ భూకంపం టొబెలోకు ఉత్తరాన 177 కి.మీ. భూకంప కేంద్రం 99 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. అయితే ఈ భూకంపం వలన ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. ఇండోనేషియాలో భూకంప ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.

గత నెలలో కూడా ఇండోనేషియా భూకంపం ధాటికి వణికిపోయింది. జనవరి 10న సంభవించిన ఈ భూకంపం తీవ్రత 7.7. దీని కేంద్రం భూమి యొక్క ఉపరితలం క్రింద 97 కిలోమీటర్ల (60.27 మైళ్ళు) లోతులో ఉంది. అయితే ఈ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇవి కూడా చదవండి

ఇండోనేషియాలోని టొబెలోకు ఉత్తరాన 177 కి.మీ దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: USGS

గతేడాది 5.6 తీవ్రతతో భూకంపం గతేడాది ఇండోనేషియాలో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించింది. 268 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. అలాగే 150 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఈ భూకంపంలో 100 మంది చిన్నారులు కూడా చనిపోయారు. భూకంపం కారణంగా ఇండోనేషియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రుల్లో రోగుల రద్దీ నెలకొంది.

టర్కీలో మళ్లీ భూమి కంపించింది టర్కీలో గురువారం సాయంత్రం మళ్లీ భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. టర్కీలో మూడు రోజుల్లో రెండోసారి భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం రెండు దేశాల్లోనూ విధ్వంసం సృష్టించింది. భూకంపం కారణంగా ఇరు దేశాల్లో మొత్తం మృతుల సంఖ్య 47,244 దాటింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..