Viral: మూడేళ్లుగా రోజూ పీరియడ్స్.. భరించలేని నొప్పితో ఆస్పత్రికి.. CT స్కాన్ చేయగా
నెలసరి సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అసౌకర్యంగా మాత్రమే కాదు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. పీరియడ్స్ సాధారణంగా నెలకు మూడు నుంచి వారం రోజుల పాటు ఉంటాయి. కానీ అదే నెలసరి మూడేళ్ళుగా ప్రతీ రోజూ ఉంటే.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

పీరియడ్స్.. ఇవి వచ్చినప్పుడు మహిళలు శారీరికంగా, మానసికంగా తీవ్ర అసౌకర్యాన్ని అనుభవించడమే కాదు.. నొప్పికి కూడా గురవుతారు. అలాగే నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. ఈ పీరియడ్స్ అనేవి నెలకు మూడు నుంచి వారం రోజుల పాటు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే అమెరికకు చెందిన ఓ మహిళ మాత్రం మూడేళ్లగా రోజూ పీరియడ్స్‌తో తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రతీరోజూ అసౌకర్యమే కాకుండా.. రక్తస్రావం జరుగుతుండటంతో.. ఎంతోమంది వైద్యులకు తన సమస్యను చూపించుకుంది.. అయితే దానికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
ఎన్ని మందులు వాడినా ఏ ప్రయోజనం లేకపోయింది. అసలు నెలకు మూడు లేదా నాలుగు రోజులు ఉండే పీరియడ్స్.. మూడేళ్లుగా కొనసాగడం ఓ వింత పరిస్థితి అయితే.. దానికి కారణం తెలియక ఈమె అనుభవించే నరకం మరో ఎత్తు. రోజూ రక్తస్రావం అవుతుండటంతో ఆమె తరచూ తలనొప్పి, తిమ్మిర్లు, కండరాల నొప్పితో ఇబ్బందిపడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన పాపీ అనే మహిళ ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటోంది. మూడేళ్లుగా ఆమెకు ప్రతీ రోజూ నెలసరి కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ఎంతోమంది వైద్యులను సంప్రదించినా.. ఎన్ని చికిత్సలు చేసినా.. ఏ ప్రయోజనం లేకపోయింది. దాదాపు 950 రోజులు తర్వాత అనగా అటూఇటుగా మూడేళ్లు గడిచిన తర్వాత ఈ సమస్యకు అసలు కారణం తెలిసిందని పాపీ తెలిపింది. ఆ కారణాన్ని వైద్య పరిభాషలో ‘బైకార్నుయేట్ యుటెరస్’(పుట్టుకతో వచ్చే Uterus వైకల్యం) అని అంటారు. దాని వల్ల ఆమెకు పీరియడ్స్ ఆగట్లేదట. ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుందని వైద్యులు చెప్పారు. కేవలం 5 శాతం మంది మహిళలు ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటారట.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. ఆ ఐదు శాతం మంది మహిళల్లోనూ.. చాలామందిలో బైకార్నుయేట్ యుటెరస్ లక్షణాలు కనిపించవని డాక్టర్లు అన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటుండగా.. దీనికి హర్మోనల్ థెరపీతో పాటు శస్త్రచికిత్స కూడా చేయాల్సి వస్తుందట. అలాగే రోజూ పీరియడ్స్ రావడంతో తన సంపాదన ఎక్కువ మొత్తం ప్యాడ్స్‌కు, నెలసరి ఉత్పత్తులకే అయిపోయేదని పాపీ తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
