AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olympics Games: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఈ ఆరు టీమ్స్‌కే ఛాన్స్‌!

2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరగబోయే విశ్వ క్రీడల్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు నిర్వహించనున్నారు. అయితే ఈ క్రికెట్ పోటీల్లో ఆరు జట్లు పాల్గొంటాయని తాజాగా నిర్వాహాకులు నిర్ణయించారు. ఆతిథ్య దేశమైన అమెరికా నేరుగా పాల్గొనే అవకాశం ఉండగా..మిగతా జట్ల ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Olympics Games: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఈ ఆరు టీమ్స్‌కే ఛాన్స్‌!
Cricket Olympics 2028
Anand T
|

Updated on: Apr 10, 2025 | 1:44 PM

Share

Olympics Games 2028: దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మళ్లీ ఒలింపిక్స్‌లో చోటు దక్కింది. 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరగబోయే విశ్వ క్రీడల్లో క్రికెట్‌ ను కూడా నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే 2028 ఒలింపిక్స్‌ కు ఆథిత్యం వహిస్తున్న ఆగ్రరాజ్యం కసరత్తు స్టార్ట్ చేసింది. టీ20 ఫార్మాట్‌లో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో పురుషలు, మహిళల విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఈ పోటీల్లో ఎన్ని జట్లు పాల్గొనాలనే దానిపై నిర్వాహకులు తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారు. మొత్తం ఆరు జట్లు పోటీలో పాల్గొంటాయని తెలిపారు. అయితే ఈ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం వహిస్తున్న అమెరికాకు మాత్రం డైరెక్ట్‌ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రికెట్ పోటీలను  టీ20 ఫార్మాట్‌లో నిర్వహించేందకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కానీ ఈ పోటీల్లో పాల్గొనబోయే జట్లు ఏవీ అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో దాదాపు 100 దేశాలు క్రికెట్‌ ఆడుతున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిపాదన ప్రకారం, నిర్దిష్ట కటాఫ్ తేదీ నాటికి ICC T20 ర్యాంకింగ్‌లలో టాప్ 6లో ఉన్న జట్లను ఒలింపిక్స్‌కు ఎంపిన చేయనున్నట్టు తెలుస్తోంది.

అయితే పురుషుల విభాగంలో ప్రస్తుత T20 ర్యాంకింగ్స్, ప్రపంచ క్రికెట్‌లోని బలమైన జట్ల ఆధారంగా చూసుకుంటే ఈ జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశంకనిపిస్తోంది. టీ20 ప్రపంచ చాంఫియన్స్‌ ర్యాంకింగ్‌లో ఇండియా ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. కాబట్టి ఒలింపిక్స్‌కు ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. తర్వాత ఆస్ట్రేలియా.. ఇది కూడా T20 ఫార్మట్‌లో బలమైనే జట్టనే చెప్పవచ్చు. గతంలో ఈ జట్టు విజేతగా కూడా నిలిచింది. దీంతో పాటు T20 అగ్ర జట్లలో ప్రపంచ కప్ విజేతలుగా ఉన్న ఇంగ్లాండ్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. వీటితో పాటు T20లో స్థిరమైన ప్రదర్శనతో బలమైన ఆటగాళ్లుగా ఉన్న న్యూజిలాండ్, T20 ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌లుగా నిలిచిన వెస్ట్ ఇండీస్, T20 ర్యాంకింగ్‌లలో తరచూ టాప్ 5-6 స్థానాల్లో ఉండే దక్షిణాఫ్రికాకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మహిళల విభాగంలో చూసుకుంటే మహిళల T20లో ఆధిపత్య జట్టు, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌లు నిలిచిన ఆస్ట్రేలియా ఈజీగా ఒలిపింక్స్‌లో ప్లేస్ సంపాధించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుత మహిళల T20 ప్రపంచ చాంపియన్‌లుగా ఉన్న న్యూజిలాండ్, గతంలో ప్రపంచ కప్ విజేతలు అయిన ఇంగ్లండ్, తమ ఆటతో ఆసియా గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన భారత్‌కు ఛాన్స్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది, మహిళల T20 ర్యాంకింగ్‌లలో తరచూ టాప్-5లో ఉండే దక్షిణాఫ్రికా, 2016 T20 ప్రపంచ కప్ విజేతలు నిలిచిన వెస్ట్ ఇండీస్ జట్లకు ఒలింపిక్స్‌లో చోటు లభించే అవకాశం ఉంది.

అయితే మనం పైన చెప్పుకున్న జట్ల ఎంపిక అనేది కేవలం అంచనా మాత్రమే. 2028 ఒలింపిక్స్‌ నిర్వహించే నాటికి T20 ర్యాంకింగ్స్‌లో మార్పులు వస్తే జట్ల ఎంపికలో కూడా మళ్లీ మార్పులు రావచ్చు. కాబట్టి ఇవే ఫైనల్ అనేది స్పష్టం చేయలేము.

దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలిపింక్స్‌లో మళ్లీ క్రికెట్‌ను నిర్వహించబోతున్నారు. 1900 ఒలింపిక్స్‌లో తొలిసారిగా క్రికెట్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ రెండు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఇందులో 158 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన బ్రిటన్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఫ్రాన్స్‌ కాంస్యం అందుకుంది. ఆ తర్వాత కొన్ని అనివార్యకారణాలతో క్రికెట్‌ను ఒలింపిక్స్‌ పోటీల నుంచి తప్పించారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..