AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB: రచ్చ గెలిచారు.. ఇంట గెలుస్తారా? ఆ ఒక్కటి మార్చుకుంటే ఆర్సీబీకి అడ్డుండదు!

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. తమ ఐదవ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఆర్సీబీ గతంలో గెలిచిన మూడు మ్యాచ్‌లు ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలోనే. ఇప్పుడు ఢిల్లీపై గృహ విజయం సాధించి, సొంత మైదానంలో మంచి రికార్డును సృష్టించుకోవడం ఆర్సీబీ లక్ష్యం. బౌలింగ్‌ ద్వారా విజయం సాధించడం ముఖ్యం.

RCB: రచ్చ గెలిచారు.. ఇంట గెలుస్తారా? ఆ ఒక్కటి మార్చుకుంటే ఆర్సీబీకి అడ్డుండదు!
Rcb Vs Dc
SN Pasha
|

Updated on: Apr 10, 2025 | 12:31 PM

Share

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. ఇక తమ ఐదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఓటమి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న డీసీకి ఆర్సీబీ తొలి ఓటమిని రుచి చూపిస్తుందా? లేదా? అన్నది క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అలాగే ఆర్సీబీ ఇప్పటి వరకు గెలిచిన మూడు మ్యాచ్‌లు కూడా బెంగళూరు బయట గెలిచింది. కేకేఆర్‌ను కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో, సీఎస్‌కేను చెన్నైలోని చెపాక్‌లో, ముంబై ఇండియన్స్‌ను వాంఖడేలో ఓడించింది. ప్రత్యర్థి జట్టు వాళ్ల సొంత మైదానంలో ఓడించడం చిన్న విషయం కాదు. కానీ, ఆర్సీబీ మూడు పెద్ద టీమ్స్‌ను, గత 17 సీజన్స్‌లో ఏకంగా 13 కప్పులు గెలిచిన ఈ మూడు టీమ్స్‌ను వారి హోం గ్రౌండ్‌లో మట్టి కరిపించింది.

కానీ, గుజరాత్‌ టైటాన్స్‌తో తమ సొంత స్టేడియం.. చిన్నస్వామిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. మరి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిన్న స్వామి స్టేడియంలో ఓడించి.. డీసీకి తొలి ఓటమి, సొంత గడ్డపై గెలుపును ఆర్సీబీ సాధింస్తుందో లేదో చూడాలని క్రికెట్‌ అభిమానులంతా చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరి చాలా కాలంగా ఆర్సీబీకి వాళ్ల హోం గ్రౌండ్‌లో అంత మంచి రికార్డ్‌ లేదు. ఈ సారైనా దాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి. ఓ వేళ ఢిల్లీపై ఆర్సీబీ గెలవాలంటే మాత్రం.. చిన్నస్వామి స్టేడియంలో వాళ్ల బౌలింగ్‌ మరింత స్ట్రాంగ్‌ అవ్వాలి. గతంలో ఏ సీజన్‌లో లేని విధంగా ఆర్సీబీ బౌలింగ్‌ ఎటాక్‌ స్ట్రెంతెన్‌ అయినప్పటికీ.. చిన్నస్వామి స్టేడియంలో వాళ్ల బౌలింగ్‌ అంత ఇంప్యాక్ట్‌ఫుల్‌గా లేదు.

ఈ సీజన్‌లో అక్కడ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడినప్పటికీ.. హోం గ్రౌండ్‌లో ప్రత్యర్థి టీమ్స్‌కు అవకాశం ఇవ్వకపోవడమే మంచిది. ముందుగా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు.. కానీ, ఆర్సీబీ రచ్చ గెలుస్తుంది, కానీ, ఇంట ఓడిపోతుంది. ఆ పరంపరను బ్రేక్‌ చేయాలంటే.. క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయాలి. ఎందుకంటే.. చిన్నస్వామి స్టేడియం పేరుకు తగ్గట్లే.. చిన్నగా ఉంటుంది. బౌండరీలు చాలా ఈజీగా కొట్టొచ్చు.. ఇలాంటి స్టేడియంలో బౌలర్లు ఎఫెక్టివ్‌గా లేకుంటే.. ప్రత్యర్థి బ్యాటర్లు ఈజీగా కొట్టేస్తారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. సో.. డీసీని ఓడించాలన్నా.. సొంత గడ్డపై గెలవాలన్నా.. ఆర్సీబీ బౌలర్ల చేతుల్లోనే ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..