Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akiya Houses: ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు.. కారణం ఏమిటంటే

జపాన్‌లో నిరంతరం తగ్గుతున్న జనాభా దానికి పెద్ద సమస్యగా మారుతోంది. జనాభా లేకపోవడంతో ఇక్కడ ఖాళీగా ఉండే (ఐకియా)ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. 2018లో గత సర్వే కంటే అక్టోబర్ 2023 నాటికి ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య అర మిలియన్ కంటే ఎక్కువ పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లను ఐకియా అంటారు. జనాభా క్షీణతతో పాటు గ్రామీణ జనాభా నగరాలకు మారడం దీనికి ప్రధాన కారణం.

Akiya Houses: ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు.. కారణం ఏమిటంటే
Akiya Houses
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2024 | 9:19 AM

ఓ వైపు భారతదేశంలో జనాభా నిరంతరం పెరుగుతోంది. వనరులు కొరతగా మారుతున్నాయి. ముఖ్యంగా నివసించడానికి ఇళ్ళు నిర్మించడానికి స్థలం తక్కువ అవుతోంది. అయితే ప్రతి దేశంలో ఇదే పరిస్తితి లేదు. కొన్ని దేశాలు ముఖ్యంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో రోజు రోజుకీ జనాభా తగ్గుతోంది. ఇలా తగ్గుతున్న జనాభాతో కొన్ని దేశాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. జపాన్‌లో నిరంతరం తగ్గుతున్న జనాభా దానికి పెద్ద సమస్యగా మారుతోంది. జనాభా లేకపోవడంతో ఇక్కడ ఖాళీగా ఉండే (ఐకియా)ఇళ్ల సంఖ్య పెరుగుతోంది.

2018లో గత సర్వే కంటే అక్టోబర్ 2023 నాటికి ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య అర మిలియన్ కంటే ఎక్కువ పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లను ఐకియా అంటారు. జనాభా క్షీణతతో పాటు గ్రామీణ జనాభా నగరాలకు మారడం దీనికి ప్రధాన కారణం.

ఇళ్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి?

జపాన్‌లో ఐకియా గృహాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఇళ్లు చాలా పాతవి. ఈ ఇంటి యజమానులు తమ ఇళ్లను వదిలి ఇతర నగరాలకు మారినందున శిథిలావస్థలో ఉన్నాయి. ఇళ్ల యజమానులు కూడా వాటిని మరమ్మతులు చేయించడానికి లేదా కూల్చివేయడానికి ఇష్టపడడం లేదు. ఈ సమస్య గ్రామాల్లోనే కాదు, నగరాల్లోనూ ఉందని పలు లెక్కల ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

జపాన్‌లో మొత్తం ఇళ్లలో ఖాళీ గృహాల సంఖ్య14 శాతం ఉంది. నోమురా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం దేశంలో సుమారు 11 మిలియన్ ఇళ్ళు అకియా గృహాలున్నాయి. అయితే ఈ సంఖ్య ఒక దశాబ్దంలో 30 శాతం కంటే ఎక్కువ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఖాళీగా ఉంచడం పన్ను ఆదా చేయడానికి ఒక మార్గం

సర్వేలో 4.4 మిలియన్ ఇళ్లు అద్దెకు అందుబాటులో ఉన్నాయని తేలింది. అయితే ఈ ఇళ్లన్నీ చాలా కాలంగా ఖాళీగా ఉండడంతో అద్దె కూడా పెంచలేకపోతున్నారు. అలాంటి ఇళ్లు చాలా వరకు ప్రధాన జనాభాకు దూరంగా ఉన్నాయి. సర్వే ప్రకారం 3.8 మిలియన్ల గృహాల స్థితి తెలియదు. 9 మిలియన్ల ఇళ్లల్లో 330,000 మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. జపాన్ చట్టం ప్రకారం ఖాళీ స్థలాల కంటే భవనాలు ఉన్న సైట్‌లపై పన్ను తక్కువగా ఉంటుంది. పాత ఇళ్లను కూల్చివేస్తే.. ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది.

లాభపడుతున్న విదేశీయులు

ఈ ఖాళీ గృహాల పెరుగుదల జపాన్ ను సందర్శించడానికి వెళ్లే విదేశాలకు లేదా జపాన్‌కు పని కోసం వెళ్ళిన వారికి ప్రయోజనం చేకూరుస్తోంది. ఇక్కడ సందర్శించే పర్యాటకులకు, విదేశీ కార్మికులకు అకియా ఇళ్లు చౌకగా అద్దెకు తీసుకుని తమ పర్యటనను ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..