Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో పాటు పుట్టుకొచ్చిన కొత్త వంటలు.. ఉల్లి, పన్నీర్ పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు.. వీడియో వైరల్

కోవిడ్ తర్వాత ప్రతి ఇంట్లో ఒక చెఫ్ పుట్టుకొచ్చారు. ఈ సంగతి మనందరికీ తెలిసిందే.. వివిధ ఆహార పదార్థాలతో ప్రయోగాలు చేశారు.. ఆ ప్రయోగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. తద్వారా ప్రజలు కొత్త ఆహార పదార్ధాలను సృష్టిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని రకాల వంటలు ఆకట్టుకుని మళ్ళీ మళ్ళీ చూడాలని.. ఒక్కసారైనా వాటిని రుచు చూడలనిపించేవిగా ఉంటే మరికొన్ని వంటలను తయారు చేయడం చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. ఒక వ్యక్తి గులాబీ పువ్వులను ఉపయోగించి పకోడీలను తయారు చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

కరోనాతో పాటు పుట్టుకొచ్చిన కొత్త వంటలు.. ఉల్లి, పన్నీర్ పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు.. వీడియో వైరల్
Rose Pakodas
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2024 | 8:38 AM

స్నాక్స్ అనగానే అందరికి ముందుగా గుర్తుకోచేది వేడి వేడి పకోడీ.. ముఖ్యంగా వర్షం పడుతుంటే రుచికరమైన వేడి వేడి శనగపిండి పకోడాలను తినాలని కోరుకుంటారు. అసలు పకోడీ గుర్తుకొస్తే చాలు ప్రతి ఒక్కరి నోళ్లలో నీరు ఊరుతుంది. వీటి స్పెషాలిటీ ఏమిటంటే, బయటి కరకరలాడుతూ.. లోపల చాలా మెత్తగా ఉంటాయి. పకోడీలను తింటూ టీ తాగుతూ చాలా మంది ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ఇంటికి అతిథులు వచ్చినా, ఏదైనా విశేషాలు జరిగినా ఇంట్లో ముందుగా అందజేసేది టీ, పకోడీలనే. అలాంటి వంటే ఈ రోజుల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తరువాత.. దేవుడా వంటల పేరుతో చేసే ప్రయోగాలు ఎప్పుడు మానేస్తారో అని అనుకుంటారు కూడా..

కోవిడ్ తర్వాత ప్రతి ఇంట్లో ఒక చెఫ్ పుట్టుకొచ్చారు. ఈ సంగతి మనందరికీ తెలిసిందే.. వివిధ ఆహార పదార్థాలతో ప్రయోగాలు చేశారు.. ఆ ప్రయోగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. తద్వారా ప్రజలు కొత్త ఆహార పదార్ధాలను సృష్టిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని రకాల వంటలు ఆకట్టుకుని మళ్ళీ మళ్ళీ చూడాలని.. ఒక్కసారైనా వాటిని రుచు చూడలనిపించేవిగా ఉంటే మరికొన్ని వంటలను తయారు చేయడం చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. ఒక వ్యక్తి గులాబీ పువ్వులను ఉపయోగించి పకోడీలను తయారు చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ వ్యక్తి ముందుగా గులాబీలను శెనగపిండిలో వేసి, ఆపై వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేయించి, ఆ తర్వాత వాటిని ప్లేట్లలో వేసి తినడానికి సిద్ధం చేయడం కూడా వీడియోలో చూడవచ్చు. ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. కానీ వీటిని ఎవరు తింటారనే ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఇది చూసిన పకోడీ ప్రియుల కోపం ఆకాశానికి చేరుకుంది.

ఈ క్లిప్‌ను జ్ఞానిబాబానితేష్ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు లక్షలాది మంది చూసి, కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు ఇప్పుడు జీవితంలో చూడడానికి మిగిలి ఉన్నది ఇదే అని అంటే.. మరొక వినియోగదారు రాశారు వీటిని ఎలా రుచి చూస్తారో ఊహించండి అని కామెంట్ చేశారు. మరొకరు వీటిని తిన్న తర్వాత, మీరు నేరుగా ఆసుపత్రికి వెళ్లాలని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..