AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prime Minister Narendra Modi: అఫ్గన్లకు తక్షణ ఆపన్న హస్తం అందించాలి.. G20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు

అఫ్ఘానిస్థాన్ అంశంపై ప్రత్యేకంగా జరిగిన జీ20 సమావేశంలో పాల్గొన్నారు మోదీ.. ఈ మీటింగ్ వర్చువల్ పద్ధతిలో జరిగింది.

Prime Minister Narendra Modi: అఫ్గన్లకు తక్షణ ఆపన్న హస్తం అందించాలి.. G20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు
Modi
Follow us
Rajeev Rayala

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 13, 2021 | 7:04 AM

Prime Minister Narendra Modi: అఫ్ఘానిస్థాన్ అంశంపై ప్రత్యేకంగా జరిగిన జీ20 సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  ఈ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. అఫ్ఘాన్ ను మానవీయ కోణంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. అఫ్గన్లకు తక్షణ ఆపన్న హస్తం అందించాలిని ప్రధాని పిలుపునిచ్చారు. అంతేకాకుండా అన్ని దేశాలతో కలిసి ముందుకుసాగే విధంగా అక్కడి పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నారు. అఫ్ఘానిస్థాన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి అడ్డాగా మారకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. అఫ్గన్ ప్రజలు పడుతున్న ఆకలి బాధలు, పోషకాహార లోపం వంటి సమస్యల తీవ్రతను ప్రతి భారతీయుడూ అర్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి అఫ్ఘానిస్థాన్‌కు మనవతా సహాయం అందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే అఫ్గన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహరం దొరక్క ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారుల్లో సగం మందికి పైగా పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ముప్పై శాతం మంది పౌరులకు కూడా సరైన తిండి దొరకడం లేదని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటీ రియన్ విభాగం తెలిపింది. ఆహారం.. వైద్య సదుపాయాలు.. అందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేరకు వర్చువల్ పద్దతితో జీ 20 సమావేశాన్ని నిర్వహించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Brahmotsavam: గహవాహనంపై ఊరేగిన శ్రీవారు.. స్వామివారిని దర్శిస్తే.. కర్మ నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం

Sajjala: సజ్జల రామకృష్ణారెడ్డి మా సమస్యలపై సానుకూలంగా స్పందించారు: ఏపీజేఎసీ ఛైర్మన్

Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..