Brahmotsavam: గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు.. స్వామివారిని దర్శిస్తే.. కర్మ నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం
Brahmotsavam: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కరోనా నిబంధనల నడుమ అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరోరోజు..
Brahmotsavam: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కరోనా నిబంధనల నడుమ అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరోరోజు ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు. ఈరోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామీ దేవేరులతో కలిసి గజ వాహనంపై కొలువుదీరారు. గజవాహనంపై మాడా వీధుల్లో ఊరేగుతూ.. స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. గజవాహనంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తే.. కర్మం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉంది. భక్తులు కూడా విశ్వసిస్తారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు మంగళవారం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజులకురాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్ఠించారు.
ఉదయం స్వామివారి సాలకట్ల ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహనసేవ నిర్వహించారు. హనుమంత వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ వేడుకల్లో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.