Sajjala: సజ్జల రామకృష్ణారెడ్డి మా సమస్యలపై సానుకూలంగా స్పందించారు: ఏపీజేఎసీ ఛైర్మన్

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Oct 12, 2021 | 10:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చామని ఆయన అన్నివిధాల సానుకూలంగా

Sajjala: సజ్జల రామకృష్ణారెడ్డి మా సమస్యలపై సానుకూలంగా స్పందించారు: ఏపీజేఎసీ ఛైర్మన్
Sajjala

Follow us on

APJAC: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చామని ఆయన అన్నివిధాల సానుకూలంగా స్పందించారని ఏపీజేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు చెప్పారు. “మా సమస్యల పరిష్కారంపై సజ్జల సానుకూలంగా స్పందించారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని సజ్జల హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సీఎస్ సమీర్ శర్మను కలిశాం. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తారని ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాలు ఆశిస్తున్నాయి. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదు. ఎవరైనా చనిపోతే మట్చిఖర్చులకూ డబ్బులు రావడం లేదు. 1న వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం. మెడికల్ అండ్ హెల్త్ లో ప్రమోషన్లు పై సజ్జల సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇంకా ఇవ్వలేమని చెప్పా. మాపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి.” అని బండి శ్రీనివాసులు వెల్లడించారు.

ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న ఉద్యోగసంఘం నేత శ్రీనివాసులు.. డెడ్ లైన్ దాక రాలేదని చెప్పారు. ” 10 ప్రధాన సమస్యలను మెమోరాండం రూపంలో సజ్జలకు ఇచ్చాం. జీతాలు,పెన్షన్లు చాలా లేటుగా వస్తున్నాయి. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 11వ పీఆర్సీఅమలు, సీపీఎస్ వెంటనే రద్దు చేయాలని వెంటనే కోరాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సుంగ్ వేతనాలు పెంపు, కరోనా తో చనిపోయివారికి సాయం చేయాలని కోరాం. మొత్తం 10అంశాలపై సజ్జలకు వినతిపత్రం ఇచ్చాం. సీఎంతో సమావేశం ఏర్పాటుచేయించాలని కోరాం. పరిష్కరించకపోతే ఉద్యమానికి వెళ్తామని స్పష్టం చేశాం.” అని శ్రీనివాసులు తెలిపారు.

Read also: Minister Gangula: తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కి కరోనా పాజిటివ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu