AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారి తాలిబన్ల ఘాతుకం.. 14 మంది హజారా వర్గం ప్రజల ఊచకోత..

తాలిబన్లు అమెరికాకు ఇచ్చిన డెడ్‌లైన్‌ మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా మరోసారి అరాచకానికి తెగబడ్డారు. తాజాగా 14 మంది హజారా వర్గం సభ్యుల ఊచకోత కోశారు. ఇందులో 12 మంది లొంగిపోయిన..

Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారి తాలిబన్ల ఘాతుకం.. 14 మంది హజారా వర్గం ప్రజల ఊచకోత..
Taliban
Sanjay Kasula
|

Updated on: Aug 30, 2021 | 10:19 PM

Share

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమాయక పౌరులను పిట్టలా కాల్చేస్తున్నారు. ఓ వ్యక్తిని హెలికాప్టర్‌కు ఉరి తీసి తమ రాక్షసత్వాన్ని చాటుకున్నారు.. హెలికాప్టర్‌ వేలాడదీసి ఆ వ్యక్తిని కింద నుంచి షూట్‌ చేశారు. మరోవైపు 14 మంది హజారా వర్గం ప్రజలను దారుణంగా కాల్చిచంపారు. 12 మంది లొంగిపోయిన సైనికులతో పాటు ఇద్దరు సామాన్య పౌరులను కాల్చి చంపారు. కేథిర్‌ జిల్లా హజారాప్రావిన్స్‌లో తాలిబన్ల అరాచకం బయటపడింది

తాలిబన్లు అమెరికాకు ఇచ్చిన డెడ్‌లైన్‌ మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా మరోసారి అరాచకానికి తెగబడ్డారు. తాజాగా 14 మంది హజారా వర్గం సభ్యుల ఊచకోత కోశారు. ఇందులో 12 మంది లొంగిపోయిన సైనికులుకాగా మరో ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. తాలిబన్ల రాజ్యం ఎప్పుడు మొదలైనా ముందుగా బలయ్యేది మాత్రం హజారాలు. అఫ్గానిస్తాన్ చరిత్రలో తీవ్ర అణచివేతకు గురైన వర్గం ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేది హజారాలు. హజారాలు షియాలు కావడంతో వారిపై దాడులు చేస్తున్నారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్‌ అరాచకిస్తాన్‌గా మారిపోతోంది. మారిన మనుషులమని చెప్పుకుంటూనే తాలిబన్లు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా ఆఫ్ఘనిస్తాన్‌ మారిపోతోందని అనడానికి తాజా ఘటనే నిదర్శనం.

ఆఫ్ఘన్‌లో తాలిబన్లు అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ టీవీ యాంకర్​ను లైవ్​లోనే బెదిరించారు సాయుధ తాలిబన్లు. యాంకర్‌కు తుపాకులు ఎక్కుపెట్టి..భయపడొద్దని చెప్పి మరీ పొగిడించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇరానీ జర్నలిస్ట్​ మసీ అలినెజాద్ ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఇది అరాచకమని పేర్కొన్నారు. ఆఫ్ఘన్లు భయాందోళన చెందొద్దని చెబుతూనే ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఘటనేనని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. అల్‌ఖైదా కీలక నేత , లాడెన్‌కు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన అమీన్‌ ఉల్‌ హక్‌ తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌ చేరుకున్నాడు. నాన్గార్‌ రాష్ట్రానికి చేరుకున్నాడు అమీన్‌ ఉల్‌ హక్‌. తాలిబన్లతో పాటు అల్‌ఖైదా ఉగ్రవాదులు ఈ టెర్రర్‌ గురుకు ఘనస్వాగతం పలికారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను తిరిగి ఉగ్రవాదుల అడ్డాగా మార్చబోమని దోహా చర్చల్లో భాగంగా అమెరికాకు హామీ ఇచ్చిన తాలిబన్లు మాట తప్పారు. అల్‌ఖైదా కీలక నేత అమీన్‌ ఉల్‌ హక్‌కు స్వాగతం పలకడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు రెండు రోజుల క్రితం పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజార్‌ కూడా ఆఫ్ఘనిస్తాన్‌ వచ్చాడు. తాలిబన్‌ అగ్రనేత బరాదర్‌తో భేటీ అయ్యాడు. కశ్మీర్‌ విముక్తికి సాయం చేయాలని బరాదర్‌ను కోరాడు మసూద్ అజార్‌. ఆఫ్ఘనిస్తాన్‌ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులందరినీ ఇప్పటికే విడిచిపెట్టారు తాలిబన్లు.

ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..

నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..