Huzurabad By Election: నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..
Minister T Harish Rao: హుజూరాబాద్ గడ్డ... టీఆర్‌ఎస్ అడ్డా అన్నారు మంత్రి హరీష్‌రావు. ఈటల రాజేందర్ చేరక ముందు నుంచి టీఆర్‌ఎస్ అక్కడ ఉందన్నారు. అసలు నియోజకవర్గంలో బీజేపీకి ఓటేసే వాళ్లు ఉన్నారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను..
హుజూరాబాద్ గడ్డ… టీఆర్‌ఎస్ అడ్డా అన్నారు మంత్రి హరీష్‌రావు. ఈటల రాజేందర్ చేరక ముందు నుంచి టీఆర్‌ఎస్ అక్కడ ఉందన్నారు. అసలు నియోజకవర్గంలో బీజేపీకి ఓటేసే వాళ్లు ఉన్నారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని హరీష్ రావు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆత్మగౌరవం అంటే గోడ గడియారాలు పంచడమేనా అని ఈటలను నిలదీశారు హరీష్‌రావు. ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు.. బీజేపీ పార్టీకిలాభం. అదే.. గెల్లు శ్రీను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభం అని గుర్తు చేశారు. విదేశాల నుండి నల్లధనం తెప్పించి… ఒక్కొకరి అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు వెస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా వేశారా..? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ అభివృద్దికి మలుపు అని మంత్రి హరీష్ రావు చెప్పారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. వీణవంకలో కనీసం రూ. 10 లక్షల పనిచేశారా అని ఆయన ప్రశ్నించారు.
హుజూరాబాద్ అభివృద్ది కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి రావాలని ఆయన సూచించారు. రూ. 5 వేల కోట్ల ప్యాకేజీని తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ నేతలు హుజూరాబాద్ లో ఓట్లు అడగాలని ఆయన కోరారు. నోట్ల రద్దుతో అవినీతి ధనం ఎంతో లెక్క తేల్చారా అని ఆయన ప్రశ్నించారు.
డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు తప్పఆ పార్టీ చేసిందేమి లేదన్నారు. ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిందేమిటో లెక్కలు మొత్తం మొన్ననే చెప్పామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..