AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR: ఎందుకీ సమావేశం.. ఏం చర్చిస్తారు.. తెలంగాణా రాజకీయాల్లో ఇదే హాట్‌టాపిక్..

ఎందుకు? అందులో ఏయే అంశాలు చర్చిస్తారు? ఆ మీటింగ్‌కు ఎవరెవరు హాజరవుతారు? ఆ తర్వాత ఎలాంటి ప్రకటన వెలువడుతుంది? తెలంగాణ రాజకీయాల్లో...

YSR: ఎందుకీ సమావేశం.. ఏం చర్చిస్తారు.. తెలంగాణా రాజకీయాల్లో ఇదే హాట్‌టాపిక్..
Ys Vijayalakshmi Meeting
Sanjay Kasula
|

Updated on: Aug 30, 2021 | 5:36 PM

Share

దివంగత సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సతీమణి సెప్టెంబర్‌-2న హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు? అందులో ఏయే అంశాలు చర్చిస్తారు? ఆ మీటింగ్‌కు ఎవరెవరు హాజరవుతారు? ఆ తర్వాత ఎలాంటి ప్రకటన వెలువడుతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఆ సమావేశం ఇప్పుడు హాట్‌టాపిక్. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మంచి హీట్‌ మీద ఉన్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిను అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకోవడంతో యుద్ధవాతావరణం నెలకొంది. ఇదే సమయంలో చోటుచేసుకుంటున్న పలు కీలక పరిణామాలు పాలిటిక్స్‌ను మరింత రంజుగా మారుస్తున్నాయి. ఇప్పటికే YSRTP అధ్యక్షురాలు షర్మిల విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వైఎస్‌ విజయలక్ష్మి పొలిటికల్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. సెప్టెంబర్‌-2న ఆమె కీలక భేటీ నిర్వహిస్తున్నారు. దివంగత YS రాజశేఖ‌ర్‌రెడ్డి కేబినెట్‌లోని నేతలు, మరికొందరు YS స‌న్నిహితుల‌తో సమావేశం కానున్నారు.

YS రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణించిన సెప్టెంబ‌ర్ 2 నాటికి 12 ఏళ్లు పూర్తి కానుంది. క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌లో జరిగే వర్ధంతి కార్యక్రమం తర్వాత నేరుగా హైదరాబాద్ వస్తారు విజయలక్ష్మి. అనంతరం రాజ‌కీయ భేటీ నిర్వహిస్తారు. ఇప్పటికే ప‌లువురికి ఆహ్వానం పంపారు. అయితే అప్పుడు YSRకు స‌న్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్నారు. మరి వారు విజయలక్ష్మి నిర్వహించే సమావేశానికి వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది..

ఈ స‌మావేశానికి ఎవ‌రు హ‌జ‌ర‌వుతారు.? అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రెండో తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి…ఇప్పటి వ‌ర‌కు ప్రత్యక్షంగా ఏలాంటి పొలిటికల్ మీటింగ్స్‌ నిర్వహించలేదు విజయలక్ష్మి. కానీ షర్మిల పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. తన కూతుర్ని ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజల్ని కోరుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సమావేశం ఏర్పాటు చేయడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మీటింగ్‌ను షర్మిలకు మద్దతుగా నిర్వహిస్తున్నారా? లేక మరేదైనా ఎజెండా ఉందా? అన్నదానిపై సెప్టెంబర్‌-2 తర్వాతే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..

నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..