AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Taliban: ఆగని తాలిబన్ల అరాచకాలు.. సంగీత కళాకారుడి ముందే ..

ఓవైపు ఆర్థిక సంక్షోభం, తినడానికి తిండి దొరకని పరిస్థితి.. మరోవైపు ప్రపంచ దేశాల సహాయ నిరాకరణ.. అయినా అఫ్గానిస్తాన్ లోని  తాలిబన్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అక్కడ యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పలు

Afghanistan Taliban: ఆగని తాలిబన్ల అరాచకాలు.. సంగీత కళాకారుడి ముందే ..
Basha Shek
|

Updated on: Jan 17, 2022 | 6:02 AM

Share

ఓవైపు ఆర్థిక సంక్షోభం, తినడానికి తిండి దొరకని పరిస్థితి.. మరోవైపు ప్రపంచ దేశాల సహాయ నిరాకరణ.. అయినా అఫ్గానిస్తాన్ లోని  తాలిబన్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అక్కడ యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు నివేదికలు వెల్లడిస్తున్నా తాలిబన్ల తమ క్రూర పాలనను అలాగే కొనసాగిస్తున్నారు.   ఇటీవల దుస్తుల దుకాణాల్లో ఉండే బొమ్మల తలలను సైతం నరికి తమ క్రూరత్వాన్ని చాటుకున్న తాలిబన్లు.. ఇప్పుడు సంగీతంపై పడ్డారు. సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేయాలని పాటల రికార్డులను నాశనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా వాహనాల్లో పాటలు వినకూడదని,  ఆఖరుకు వివాహ వేడుకల్లో సైతం మ్యూజిక్ ఉండకూడదని వింత నిబంధనలు పెడుతున్నారు. పైగా వరుడు, వధువు వేర్వేరు గదుల్లో ఉండి వివాహం చేసుకోవాలంటున్నారు.  ఇక తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరి దగ్గరైనా సంగీత పరికరాలు ఉంటే వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు.

తాజాగా తాలిబన్లు  పాక్టియా ప్రావిన్స్ జిల్లాలో నివాసముంటోన్న ఒక సంగీత వాయిద్యకారుడి ఇంటిపై దాడి చేశారు. అతనిని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు. తర్వాత అతని దగ్గర ఉన్న హార్మోనియం పెట్టేను అతని కళ్లముందే తగలబెట్టారు. అంతేకాదు.. మంటల్లో కాలుతున్న ఆ సంగీత పరికరాన్ని కన్నార్పకుండా చూడాలంటూ  వికృతంగా ప్రవర్తించారు.  ఓవైపు ఆ సంగీత కళాకారుడి నిస్సహాయత, బాధతో ఏడుస్తుంటే  తాలిబన్లు నవ్వూతూ కేరింతలు కొట్టడం గమనార్హం.  మరో ఉగ్రవాది ఈ దృశ్యాన్నిసెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ఓ సీనియర్ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది.

Also Read: SBI కస్టమర్లు అలర్ట్.. వచ్చే నెల నుంచి కొత్త నియమాలు.. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..