Afghanistan-Taliban: ఆప్ఘానిస్థాన్‌లో తాలిబాన్ సర్కార్ కొలువుదీరబోతోంది.. కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఉండబోతున్నారంటే..?

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 02, 2021 | 11:34 AM

అమెరికా భద్రతా దళాలు వెళ్లిపోవడంతో ఆఫ్ఘన్ లో అధికారికంగా అరాచకం మొదలైంది. రెండే రెండు రోజుల్లో ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ రాజ్యం ఏర్పాటు కాబోతోంది.

Afghanistan-Taliban: ఆప్ఘానిస్థాన్‌లో తాలిబాన్ సర్కార్ కొలువుదీరబోతోంది.. కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఉండబోతున్నారంటే..?
Taliban Government In Aghanistan

Taliban Government in Afghanistan: అమెరికా భద్రతా దళాలు వెళ్లిపోవడంతో ఆఫ్ఘన్ లో అధికారికంగా అరాచకం మొదలైంది. రెండే రెండు రోజుల్లో ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ రాజ్యం ఏర్పాటు కాబోతోంది. ఆఫ్ఘన్ లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వానికి తాలిబన్ అగ్రనేత హీబాతుల్లా అఖుంద్‌జాదా నాయకత్వం వహించనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఉండబోతున్నారో కూడా తాలిబన్ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది.

మరి, తాలిబన్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది? ఎలాంటి విధివిధానాలు ఉండబోతున్నాయ్? మహిళలకు ప్రాధాన్యత ఉంటుందా? మహిళల మనసులు గెలుచుకునేలా విధానాలు ఉంటాయా? ఎలాంటి మోడల్ ను తాలిబన్స్ ప్రపంచం ముందు ఉంచబోతున్నారు? ఆఫ్ఘన్లను ఆకట్టుకోవడానికి ఏం చేయబోతున్నారు? వీటిపైనే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే న్యూ గవర్నమెంట్ బ్లూప్రింట్ తో ప్రపంచం ముందుకు రాబోతున్నారు తాలిబన్స్. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో విధానాలను ప్రకటించనున్నారు. అయితే, తాలిబన్ల పేరు చెబితేచాలు నిలువెల్లా వణికిపోయే ఆఫ్ఘన్ మహిళల్లో భయాందోళనలను పోగొట్టేవిధంగా విధివిధానాలు ఉంటాయా? లేదా? అన్నదే ఆసక్తి రేపుతోంది.

ప్రపంచం మొత్తం తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని తాలిబన్లు ఆశిస్తున్నారు. అందుకే, అంతర్జాతీయ ఆమోదం లభించే నేత కోసం అన్వేషిస్తున్నారు. ఆఫ్ఘన్ లో ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వానికి తాలిబన్ అగ్రనేత హీబాతుల్లా అఖుంద్‌జాదా నాయకత్వం వహించినా, అతని అండర్ లో ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ పనిచేసేలా కీలక పోస్టును క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థ TOLOnews నివేదిక ప్రకారం, తాలిబాన్ ఆఫ్ఘన్ నాయకుల మధ్య చర్చలు పూర్తయిన తర్వాత కాబూల్ కొత్త ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రకటించబోతోంది. తాలిబాన్ నాయకుడు హెబతుల్లా అఖుంద్‌జాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఒక ప్రధాని లేదా అధ్యక్షుడు తాలిబాన్ నాయకుడి కింద పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది.

కాబూల్ విమానాశ్రయం నుండి యుఎస్ దళాలు బయలుదేరిన ఒక రోజు తర్వాత, ఖతారీ సాంకేతిక నిపుణుల బృందం విమానాశ్రయ కార్యకలాపాల పునఃప్రారంభం గురించి చర్చించడానికి రాజధానిలో అడుగుపెట్టింది. చర్చ కొనసాగుతోందని ఆఫ్ఘనిస్తాన్ ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.

Read Also…  Warangal Murders: వరంగల్ సామూహిక హత్యల కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu