ఆ ఆఫ్ఘన్ బేబీ సురక్షితం..తండ్రికి అప్పగించిన అమెరికన్ సైన్యం..కాబూల్ ఎయిర్ పోర్టు ఇంకా ఉద్రిక్తం
కాబూల్ లోని విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల్లో ఎత్తయిన గోడ వంటి కంచెను దాటించిన ఆఫ్ఘన్ బేబీ సురక్షితంగా ఉందని, అమెరికన్ మెరైన్స్ (సైనికులు) ఆ పాపను ఆమె తండ్రికి అప్పగించారని మేజర్ జిమ్ స్టెంగర్ ..సీబీఎస్ న్యూస్ కి తెలిపారు.
కాబూల్ లోని విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల్లో ఎత్తయిన గోడ వంటి కంచెను దాటించిన ఆఫ్ఘన్ బేబీ సురక్షితంగా ఉందని, అమెరికన్ మెరైన్స్ (సైనికులు) ఆ పాపను ఆమె తండ్రికి అప్పగించారని మేజర్ జిమ్ స్టెంగర్ ..సీబీఎస్ న్యూస్ కి తెలిపారు. అస్వస్థతగా ఉన్న ఈ పాపను గుంపులోని ఎవరో వ్యక్తి మెరైన్స్ కి అందజేశారని ఆయన చెప్పారు. ఈ బేబీని ఓ సైనికుడు అందుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిన్నారిని వెంటనే నార్వేజియన్ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య చికిత్స పొందిందని, అనంతరం ఆ పాప తండ్రికి ఆమెను అప్పగించారని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ప్రస్తుతం ఆ తండ్రీ కూతుళ్లు ఎక్కడ ఉన్నారో తమకు తెలియదన్నారు. ఆ చిన్నారి క్షేమంగా తన తండ్రిని చేరిందంటే ఇది తమ మెరైన్స్ మానవీయ కోణానికి నిదర్శనమన్నారు. హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలోని వేలాది గుంపుల్లో తమ తలిదండ్రుల నుంచి మరో ముగ్గురు పిల్లలు కూడా తప్పిపోయారు.వారిని కూడా తమ సైనికులు రక్షించినట్టు కిర్బీ చెప్పారు. ఒకరిద్దరిని ఇవాక్యుయేషన్ చెక్ పాయింట్ వద్ద మెరైన్స్ సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిసిందన్నారు. ఏడుస్తున్న ఇద్దరు పిల్లలను వీరు తరలిస్తున్న దృశ్యాన్ని తాను చూసినట్టు ఓ మహిళ తెలిపింది.
తమను తాలిబన్ల నుంచి రక్షించాలని. ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సాయం చేయాలంటూ అనేకమంది మహిళలు, యువతులు, టీనేజర్లు దీనంగా కేకలు పెడుతున్న దృశ్యాల తాలూకు వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి. మరోవైపు ఈ విమానాశ్రయం నుంచి కొన్ని విమానాలు ఖాళీగా వెళ్తుండగా మరికొన్ని అతికొద్ది మందితో బయల్దేరుతున్నాయి. నార్వేకి చెందిన ఓ యువతి దాదాపు పూర్తి ఖాళీగా ఉన్న విమానంలో ప్రయాణించి తన స్వదేశానికి చేరుకుంది. ఇంటికి చేరిన తన ఈ కుమార్తెను చూడగానే ఆ తల్లి ఆనందానికి అంతు లేకపోయింది. కాబూల్ విమానాశ్రయంలోని అతి దయనీయ పరిస్థితిని ఆ యువతి తన తల్లికి వివరించింది. పిల్లలు, మహిళల ఆక్రందనలతో.. తాలిబన్ల బీభత్సంతో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నట్టు ఆమె పేర్కొంది.
The chaos & fear of people is a testament to the international community’s role in AFG’s downfall & their subsequent abandonment of Afghan people. The future for AFG has bn decided for its people without its people’s vote & now they live at the mercy of a terrorist group. #Kabul pic.twitter.com/k4bevc2eHE
— Omar Haidari (@OmarHaidari1) August 19, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: మంచు విష్ణు మరో షాక్..!’మా’ రచ్చ మళ్ళీనా..?హాట్ టాపిక్ గా మారిన విష్ణు ట్వీట్..:MAA Elections 2021 vIdeo.
శింగనమల మండలంలో విషాదం.. కొండపై నుండి కాలుజారి పూజారి మృతి..Priest Falls Down Live Video.
రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.
Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).