Afghanistan Crisis: రెచ్చిపోయిన తాలిబన్ ముష్కరులు.. కాబుల్‌లో 150 మంది భారతీయులు కిడ్నాప్

ఆఫ్గనిస్థాన్‌లోని తాలిబన్లు ఓ వైపు శాంతి జపం జపిస్తూనే మరోవైపు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. పాక్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత తాలిబన్లు రెచ్చిపోతున్నారు.

Afghanistan Crisis: రెచ్చిపోయిన తాలిబన్ ముష్కరులు.. కాబుల్‌లో 150 మంది భారతీయులు కిడ్నాప్
Talibans
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 21, 2021 | 1:18 PM

ఆఫ్గనిస్థాన్‌లోని తాలిబన్లు ఓ వైపు శాంతి జపం జపిస్తూనే మరోవైపు తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. పాక్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత తాలిబన్లు రెచ్చిపోతున్నారు. భారతీయులు టార్గెట్‌గా మతోన్మాద ముష్కర మూకలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఆఫ్గనిస్థాన్‌లోని భారత ఎంబెసీల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. ఇదే తీరును కొనసాగిస్తూ శనివారంనాడు దాదాపు 150 మంది భారతీయులను కాబుల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబెసీకి చెందిన ఓ ఆఫ్గన్ ఉద్యోగి ధృవీకరించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. ఆఫ్గనిస్థాన్‌లోని ప్రధాన న్యూస్ ఛానళ్లు కూడా ఈ వార్తా కథనాలు ప్రసారం చేశాయి. తమ చెరలోని భారతీయులకు తాలిబన్లు హాని తలపెట్టవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కథనాలపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ఆఫ్గనిస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ట్వీట్స్ చేశారు. భారతీయులను టార్గెట్ చేస్తూ తాలిబన్లు రెచ్చిపోవడం తీవ్ర కలకలంరేపుతోంది. తాలిబన్ల చర్యల వెనుక ఐఎస్ఐ ప్రోద్భలం ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ ఉస్కో అంటూ రెచ్చగొట్టి తాలిబన్ల చేత భారతీయులపై దాడులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారతీయులను అపహరించలేదు.. తాలిబన్ల ప్రకటన

అయితే 150 మంది భారతీయులను కిడ్నాప్ చేశామన్న కథనాలను తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వసేక్ తోసిపుచ్చారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ కాబూల్ నుండి దాదాపు 150 మంది భారతీయులను అపహరించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని.. వారిని తాము సురక్షితంగా విమానాశ్రయానికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Also Read..

శ్రీ గంప మల్లయ్య స్వామి వేడుకల్లో అపశృతి.. పూజా సమయంలో జారిపడి పూజారి మృతి

ఏపీలో రోజుకో ఘటన.. సీఎం జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు?.. ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫైర్..