Taliban Websites: ఇంటర్నెట్ నుంచి తాలిబన్ల వెబ్ సైట్స్ మిస్సింగ్.. ఎన్నో అనుమానాలు..
కాబూల్ లో తాలిబన్ల వెబ్ సైట్స్ ఇంటర్నెట్ నుంచి మిస్సయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఇవి కనబడకుండా పోయాయి. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్నది తెలియలేదు. పాష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్, దారి భాషల్లో ఈ వెబ్ సైట్లు సమాచారాన్ని ఇస్తుంటాయి...
Afghanistan Crisis: కాబూల్ లో తాలిబన్ల వెబ్ సైట్స్ ఇంటర్నెట్ నుంచి మిస్సయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఇవి కనబడకుండా పోయాయి. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందా లేక మరేదైనా కారణమా అన్నది తెలియలేదు. పాష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్, దారి భాషల్లో ఈ వెబ్ సైట్లు సమాచారాన్ని ఇస్తుంటాయి. అమెరికా-శాన్ ఫ్రాన్సిస్కో లోని ‘క్లౌడ్ ఫ్లేర్’ అనే సంస్థ ఈ సైట్స్ కి ‘రక్షణ’ కల్పిస్తుంటుంది. వీటిని ఎవరు నిర్వహిస్తున్నారో ప్రజలకు తెలియకుండా ఈ సంస్థ ‘కాపాడుతుంటుంది’. అయితే ఇంటర్నెట్ నుంచి ఇవి ఎందుకు మిస్సయ్యాయో తెలిపేందుకు ఈ సంస్థ మహిళా అధికార ప్రతినిధి నిరాకరించారు. ఈ-మెయిల్స్ కి గానీ, ఫోన్ కాల్స్ కి గానీ స్పందించేందుకు నిరాకరించారు. ఈ సైట్ల మిస్సింగ్ గురించి వాషింగ్టన్ పోస్ట్ ఓ వార్తను ప్రచురించింది. తాలిబన్లే వీటిని అర్ధాంతరంగా నిలిపివేశారా అన్న విషయం కూడా వెల్లడి కాలేదు. సాధారణంగా ఆఫ్ఘన్లకు ఇవి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తుంటాయి.
అటు-కాబూల్ లోని ప్రపంచ బ్యాంకు సిబ్బంది సురక్షితంగా పాకిస్థాన్ చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే తాలిబాన్లకు పాక్ మద్దతు స్పష్టంగా తెలిసిపోతోంది. అయితే ఈ తరలింపు విషయమై గానీ.. కాబూల్ లో మిగిలిన తమ ఇతర సిబ్బంది స్టేటస్ పై గానీ వరల్డ్ బ్యాంకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇలా ఉండగా కాబూల్ విమానాశ్రయంలో శనివారం కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ నగరాన్ని ఎవరు వీడదలిచినా వీడవచ్చునంటూ అమెరికా ప్రకటించినట్టు వార్తలు రావడంతో వందలాది మంది ఆఫ్గన్లు ఎయిర్ పోర్టు చేరుకోవడానికి పరుగులు తీశారు. ఇనుప తీగెలతో చుట్టి ఉన్న కంచెను దాటడానికి వారు యత్నిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: రాహుల్ హత్యకేసులో సంచలన నిజాలు.. స్పీడ్ అందుకున్న ఇన్విస్టిగేషన్..:Rahul Murder Mystery Live Video.
Local to global Video: రాహుల్ హత్యకేసు మరియు నకిలీ చలానా కేసులో కదులుతున్న డొంక..(వీడియో).
బిల్డింగ్ పై నుంచి కుక్క జంప్.. క్యాచ్ పట్టి కుక్కను బలె కాపాడాడు.!వైరల్ వీడియో:Dog Viral Video.