Andhra Pradesh: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. తీవ్రంగా స్పందించిన నారా లోకేష్..
Andhra Pradesh: రక్షించాల్సిన పోలీసులే కాటేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారంలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు.
Andhra Pradesh: రక్షించాల్సిన పోలీసులే కాటేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారంలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మైనిర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకెళితే.. ఏటి అగ్రహారానికి చెందిన కానిస్టేబుల్ రమేష్.. పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను పిలిచాడు. తెలిసిన వ్యక్తి కావడంతో బాలిక ఏమాత్రం సంశయించకుండా ఇంట్లోకి వెళ్లింది. అయితే, అలా ఇంట్లోకి వచ్చిన బాలిక పట్ల కానిస్టేబుల్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక అక్కడి నుంచి పారిపోయి వచ్చింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు.. రమేష్ తప్పు చేసినట్లు నిర్ధారించారు. అతన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో అమానవీయ ఘటనలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందనిఫైర్ అయ్యారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు, బాధలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. గుంటూరు ఏటి అగ్రహారంలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రాన్ని ఉలికిపాటుకు గురిచేసిందన్నారు. ‘దిశ’ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఆ కానిస్టేబుల్ అలా ప్రవర్తించారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇంత దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్‌కు 21 రోజుల్లో శిక్ష వేయకుండా.. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, ఈ చర్య ద్వారా సమాజానికి సీఎం జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.
Also read:
Four Children: ఒకే క్యాన్పులో నలుగురు పిల్లలు తల్లిపిల్లలు క్షేమం.. హర్షం వ్యక్తం చేస్తున్న దంపతులుWest Bengal: అర్థరాత్రి గుడిలో కారు డ్రైవర్‌తో బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..!