ఆ గుడికి వెళ్లాలంటే గుండెలదురుతున్నాయ్ అంటున్న జనాలు.. అసలు కారణం ఏంటంటే..

ఆ గుడికి వెళ్లాలంటే గుండెలదురుతున్నాయ్ అంటున్న జనాలు.. అసలు కారణం ఏంటంటే..
Temple

Bears at Temple: సాధారణంగా ఏ మనిషికి అయినా సమస్యలు చుట్టుముట్టినప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఆ భగవంతుడు మాత్రమే.

Shiva Prajapati

|

Aug 21, 2021 | 12:00 PM

Bears at Temple: సాధారణంగా ఏ మనిషికి అయినా సమస్యలు చుట్టుముట్టినప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఆ భగవంతుడు మాత్రమే. సమస్యలను గట్టేక్కించమంటూ దేవుడిని వేడుకుంటారు. ప్రశాంతత కోసం గుడులు, గోపురాల చుట్టూ తిరుగుతుంటారు. భక్తి ప్రపత్తులతో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ ఊర్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాత్రం గుడి అంటేనే జంకుతున్నారు. గుడి పేరు వింటేనే వారి గుండెలదురుతున్నాయి. టెంపుల్‌కి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. మరీ ఇంతలా భయపడిపోవడానికి కారణమేంటి. వారికి ఏమైనా దయ్యాలు, భూతాలు ఆవహించాయా ఏంటి? లేక మరేదైనా కారణం ఉందా? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ద్యేవుడా ఈ సీన్‌ను చూస్తే మీకేమనిపిస్తుంది. గుడి ముందు ఏదో నల్లగా తిరుగాడుతున్నట్లుగా కనిపిస్తోంది. సడెన్‌గా చూస్తే అదేదో దెయ్యం లా ఉంది. గుడి తలుపుల ముందు నిలబడి ఆ తలుపులను గట్టిగా నెడుతోంది. అదేంటా అని క్లియర్‌గా పరిశీలిస్తే.. ఎలుగుబంటి అని తేలింది. ఆలయంలోకి ప్రవేశించిన ఎలుగుబంటి గుడి తలుపుల ముందు రచ్చ చేసింది. ఆ సీన్ అంతా ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్తా వైరల్‌ అవడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

పూర్తి వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా రోల్ల మండలంలో జేరిగేపల్లి రామజమ్మ ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారంటే భక్తులకు విపరీతమైన నమ్మకం. కానీ, గుడికి వెళ్లి అమ్మవారిని పూజిద్దామంటే.. అక్కడ రెండు ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి. అడవి నుంచి వచ్చిన ఈ ఎలుగు బంట్లు ఆలయ ప్రాంగాణంలోకి నిత్యం వస్తుండటంతో స్థాకి ప్రజలు హడలిపోతున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్రూర మృగాల సంచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు దీనిపై స్పందించాలని, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Taj Mahal: పండు వెన్నెల్లో పాలరాతి అపురూపం.. రాత్రి సమయాల్లో తాజ్ మహల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్

Raksha Bandhan 2021: అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తు రాఖీ పండుగ.. స్పెషల్ మెహందీ డిజైన్స్

Megastar Chiranjeevi: అభిమానులకు మెగాస్టార్ పిలుపు.. తన బర్త్ డే రోజు ఇలా చేయండంటూ ఫ్యాన్స్‌కు చిరు విజ్ఞప్తి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu