Fish Cost: ఈ చేప బరువు 16 కేజీలు.. ధర తెలిస్తే గుండెలదిరిపోతాయి..
Fish Cost: మంచి నీటి చెరువుల్లో పెంచే చేపలు మహా అయితే 10 నుంచి 15 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఎంత బరువు పెరిగినా..
Fish Cost: మంచి నీటి చెరువుల్లో పెంచే చేపలు మహా అయితే 10 నుంచి 15 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఎంత బరువు పెరిగినా.. కిలో ధర 1000 రూపాయలకు మించి ఉండదు. ఒక్క పులస చేప లాంటి కొన్ని చేపలకు మాత్రం కొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ లక్షల్లో ధర పలకడం ఎప్పుడైనా చూశారా. పోనీ విన్నారా? వినకపోతే ఇప్పుడు వినండి.. చూడకపోతే ఇప్పుడు చూడండి. ఈ చేప బరువు 16 కిలోలు.. దాని ధర అక్షరాలా లక్ష. అవునండి ఇది నిజంగా నిజం. ఓ వ్యక్తి 16 కిలోల చేపను లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. మరి అంత మొత్తంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ స్థాయిలో ధర పలకడానికి ఆ చేపకున్న ప్రత్యేకత ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో స్థానిక మత్స్యకారుల వలకు 16కిలోల కచిడీ చేప చిక్కింది. ఈ చేపకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. దీనికి స్థానిక వ్యాపారస్తుడు ఒకరు లక్ష రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే, ఈ చేపకు అంత పెద్ద మొత్తంలో వెచ్చించడానికి ఒక కారణం ఉందంటున్నారు మత్స్యశాఖ అధికారులు. ఈ కచిడీ చేప పొట్ట భాగాన్ని వైద్య ఔషధాలకు ఉపయోగిస్తారని మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు చెప్పారు. ఈ చేపలో 98 శాతం పొట్ట భాగమే విలువైనదని పేర్కొన్నారు.
Also read:
Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట షూటింగ్ అప్డేట్.. గోవా బీచ్‌లో విలన్లను ఇరగదీస్తున్న మహేష్..