AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నకిలీ చలాన్ల పై సీఎం సీరియస్.. ఇంత జరుగుతుందటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు..

Andhra Pradesh: రాష్ట్రంలో నకిలీ చలాన్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో అధికారుల తీరుపై..

Andhra Pradesh: నకిలీ చలాన్ల పై సీఎం సీరియస్.. ఇంత జరుగుతుందటే ఏం చేస్తున్నారంటూ మండిపాటు..
Cm Jagan
Shiva Prajapati
|

Updated on: Aug 21, 2021 | 8:55 AM

Share

Andhra Pradesh: రాష్ట్రంలో నకిలీ చలాన్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో అధికారుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని తప్పు పట్టారు. ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. తక్షణం బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

రాష్ట్రంలో నకిలీ చలాన్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్టానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై సీఎం జగన్ సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ చలాన్ల కుంబకోణంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదన్నారు. ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే.. ఎందుకు మన దృష్టికి రావడంలేదని నిలదీశారు.

ఎప్పటి నుంచి, ఎన్నిరోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయో తేల్చాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా? లేవా? ఎందుకు చూడటం లేదంటూ ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకొని ఎప్పుటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తప్పులకు పాల్పడ్డ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఎం ప్రశ్నించగా.. వారందరినీ సస్పెండ్‌ చేశామని అధికారులు వివరణ ఇచ్చారు. కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాకుండా, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. సాఫ్ట్‌వేర్‌ మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చిన అధికారులు. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. మీ–సేవల్లో పరిస్థితులపైనా కూడా పరిశీలన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవినీతిని నిర్మూలించడానికి సరైన విధానాలను తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. అవినీతిపై ఎవరికి ఫోన్ కాల్‌ చేయాలో సంబంధిత ఫోన్ నెంబర్‌ను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉంచాలని ఆదేశించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్‌ మీద అధికారులు దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కాల్‌సెంటర్‌ మీద అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకోవాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం వారం పదిరోజులకు ఒకసారి అధికారులు సమావేశం కావాలని దిశానిర్దేశం చేశారు. ఆదాయవనరులు, పరిస్థితులపై సమీక్షచేయాలని సూచించారు. వివిధ రంగాల వారీగా సమీక్ష చేయాలని నిర్దేశించారు. ప్రతి సమావేశంలో ఒక రంగంపైసమీక్ష చేయాలని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును తదుపరివారంలో పరిశీలన చేయాలన్నారు.

అలాగే.. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్నారు. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం సక్రమంగా ఖజానాకు చేరేలా చూసుకోవాలన్నారు. మున్సిపల్, విద్యుత్‌ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపై కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలన్నారు. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలన్న సీఎం, దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలని ఆదేశించారు. . మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నామని, దీనివల్ల సరిహద్దులనుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నామన్నారు. ఇలాంటి వ్యవహారాలపై గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.

Also read:

Mask Using: నాన్ స్టాప్ గా మాస్క్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

Fish Rates: కోవిడ్ ఎఫెక్ట్‌తో కుదేలైన ఆక్వా రంగం.. భారీగా తగ్గిన చేపల ధరలు.. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి..

Onion Farmer: ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావొద్దు.. కీలక ప్రకటన చేసిన అధికారులు.. అసలు కారణం ఏంటంటే..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్