Breastmilk: అమెరికాలో తీవ్ర స్థాయికి చేరిన తల్లిపాల కొరత.. తన పాలను అమ్ముతానంటూ ముందుకొచ్చిన మహిళ..

Breastmilk: అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లిపాలు చేసే మేలు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి చిన్నారులకు పోషకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వైద్యులు కూడా తల్లి పాలు ...

Breastmilk: అమెరికాలో తీవ్ర స్థాయికి చేరిన తల్లిపాల కొరత.. తన పాలను అమ్ముతానంటూ ముందుకొచ్చిన మహిళ..
Follow us

|

Updated on: May 18, 2022 | 8:51 AM

Breastmilk: అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లిపాలు చేసే మేలు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిపాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి చిన్నారులకు పోషకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వైద్యులు కూడా తల్లి పాలు ఇవ్వాలని సలహా ఇస్తుంటారు. అయితే కొందరు తల్లులకు పాలు ఉండకపోవడం చిన్నారులకు సమస్యగా మారుతుంది. భారత్‌లో ఈ సమస్య తక్కువే అయినప్పటికీ అమెరికాలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ బేబీ ఫార్ములాను ఉపయోగిస్తారు. ఈ బేబీ ఫార్ముల ఒక పౌడర్‌లా ఉంటుంది. అమెరికాలోని మిలియన్ల కుటుంబాలు తమ చిన్నారుల కోసం ఈ ఫార్ములాపైనే ఆధారపడుతుంటాయి.

అయితే తాజాగా ఈ ఫార్ములా కొరత ఏర్పడింది. అమెరికా అంతటా బేబీ ఫార్ములా స్టాక్‌ తగ్గిపోయింది. గత ఫిబ్రవరిలో ఈ బేబీ ఫార్ములాను ఉత్పత్తి చేసే ఓ ప్రధాన సంస్థ మూతపడడంతో ఈ కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఇది అమెరికాలో పెద్ద సంక్షోభానికి తెర తీసింది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ఓ తల్లి ముందొక్చింది. తన పాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ఏకంగా 4000 ఔన్సులు అంటే 118 లీటర్ల పాలను అమ్మాలనుకుంటోంది. ఆమె పేరు అలిస్సా చిట్టి. అమెరికాలో ఉండే ఈమె తన పాలను ఫ్రిజర్స్‌లో స్టోర్‌ చేస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి తల్లి పాలను అందించాలని భావిస్తున్నట్లు అలిస్సా చెప్పుకొచ్చింది.

Usa

ఇవి కూడా చదవండి

ఔన్సుకు పాలకు ఒక డాలర్‌ చొప్పున విక్రయించాలని అలిస్సా ఆలోచిస్తోంది. అయితే ఈ విషయమై చిన్నారుల పేరెంట్స్‌తో చర్చించడానికి తాను సిద్ధమని చెబుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలో తల్లి పాలను ఆన్‌లైన్‌లో విక్రయించడం చట్ట బద్దం. అయితే దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పాలు అందించిన మహిళలకు అంటు వ్యాధులు ఉంటే అవి తాగిన చిన్నారులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు