Dust Storm: ఆ రెండు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇసుక తుపాను.. దుమ్మూ ధూళీ కప్పేయడంతో..
Dust Storm: ఇసుక తుఫానులు సాదీ అరేబియా, ఇరాక్‌లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రియాద్, బాగ్దాద్ నగరాల్లో ఎదరుగా ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
Dust Storm: ఇసుక తుఫానులు సాదీ అరేబియా, ఇరాక్‌లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రియాద్, బాగ్దాద్ నగరాల్లో ఎదరుగా ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళితే.. పశ్చిమాసియాలోని ఎడారి దేశాల్లో ఇసుక తుఫాను అల్లకల్లోలం రేపింది. సౌదీ అరేబియా రాజధానితో పాటు పవిత్ర నగరాలు మక్కా, మదీనాలకు భారీ దుమ్మూ ధూళీ కప్పేసింది. రియాద్‌లోని కింగ్‌డమ్ సెంటర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వాతావరణంలో దట్టంగా పేరుకుపోయిన బూడిదలాంటి దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో పట్టపగలు హెడ్‌లైట్ వేసుకొని నిదానంగా ప్రయాణించాల్సి వచ్చింది. పలు చోట్ల వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోడ్లు, చెట్లుతో పాటు భవనాలను ఇసుక పొర కప్పేసింది. దీంతో చాలా మంది ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయారు.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయిందని నగరవాసులు తెలిపారు. కళ్లలోకి, ఊపిరితిత్తుల్లోకి దుమ్ము చేరడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
మరోవైపు ఇరాన్ రాజధాని బాగ్దాద్‌ను అరెంజ్ ఇసుక తుపాను దట్టంగా కమ్మేసింది. వాతావరణం పూర్తిగా నారింజ రంగులోకి మారింది.. ఎడారి ప్రాంతం నుంచి వీచిన దట్టమైన దుమ్ము దేశంలోని పలు ప్రాంతాలను చట్టుముట్టింది. దీంతో ఇరాక్‌లోని ఏడు ప్రావిన్స్‌లలో విమానాశ్రయాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. శ్వాసకోస వ్యాధులు ఉన్నవారితో పాటు వృద్దులు,చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.