US Green Card: గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా..!
US Green Card: గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది అగ్రరాజ్యం అమెరికా. దరఖాస్తులను ఆరు నెలల్లోపు క్లియర్ చేయాలని ప్రసిడెంట్
US Green Card: గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది అగ్రరాజ్యం అమెరికా. దరఖాస్తులను ఆరు నెలల్లోపు క్లియర్ చేయాలని ప్రసిడెంట్ అడ్వయిజరీ కమిషన్ సూచించింది. అమెరికాలో ఉద్యోగం పంపాదించాలని, అక్కడ స్థిరపడాలని భారత్ సహా పలు దేశాల యువత కలలు కంటుంటారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అదో పెద్ద తతంగం ఏళ్లుగా ఎదురు చేసినా దక్కని వారెందరో.. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డు కోసం వచ్చే దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేయాలని అమెరికా ప్రసిడెంట్ అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ప్రముఖ భారత సంతతి నాయకుడు అజయ్ జైన్ భుటోరియా నేతృత్వంలోని టీమ్ సిఫార్సు చేయగా 25 మంది కమీషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీన్ని అధ్యక్షుడు జోబైడెన్ ఆమోదం కోసం శ్వేత సౌధానికి పంపించారు.
గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలను త్వరిత గతిన పూర్తి చేయాలని ఈ కమిషన్ మరో సిఫార్సు చేసింది. ఫ్యామిలీ గ్రీన్‌కార్డ్ అప్లికేషన్లు, డీఏసీఏ రెన్యూవల్స్, ఇతర గ్రీన్ అప్లికేషన్ల సమయాన్ని తగ్గించడం కోసం కూడా ఈ బృందం ప్రతిపాదనలు చేసింది. గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్ పెండింగ్‌ను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోవాలని ‘అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’కు కమిషన్ సూచించింది. వర్క్‌పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు, తాత్కాలిక పొడిగింపులు ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలు అధ్యక్షుని ఆమోదం పొందితే వేలాది మంది భారతీయులకు గ్రీన్ కార్డు లభించే అవకాశాలు మరింత సులువు కానున్నాయి.