CM KCR: జిల్లా కలెక్టర్లతో నేడు సీఎం కేసీఆర్ సమావేశం.. పంట నష్టం సమా పలు అంశాలపై చర్చించే అవకాశం..
CM KCR: రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టం సహా పలు అంశాలపై బుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
CM KCR: రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టం సహా పలు అంశాలపై బుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని సీఎంవో వెల్లడించింది. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అకాల వర్షాలతో రైతులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలతో రావాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలాఉంటే.. తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం పేరిట రాష్ట్రంలని ప్రతి గ్రామంలో సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ క్రీడా ప్రాంగాణాల ఏర్పాటు కోసం స్థలాలను సేకరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ఇప్పటికే చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణ పనుల్లో పురోగతి, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ్టి సమీక్షలో చర్చించనున్నారు. అలాగే, ఈ సమావేశంలోనే తదుపరి విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యాక్రమాల నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సమీక్షకు జిల్లాల కలెక్టర్లతో పాటు.. మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, మేయర్లు, కమిషనర్లు కూడా హాజరుకానున్నారు.