Beer Prices: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న బీర్ ధరలు.?
Beer Prices Hike: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. గత కొంతకాలంలో డిస్టలరీల యాజమాన్యాలు బీర్ ధరలను పెంచాలని కోరుతున్న నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై ఇటీవల సమావేశమయ్యారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో బీర్ ధరపై రూ 10 నుంచి రూ. 20 మేరకు పెంచనున్నారని వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం లైట్ బీర్ రూ. 140 ఉండగా.. దాన్ని రూ. 150గా, స్ట్రాంగ్ బీర్ రూ. 150 ఉండగా.. దాన్ని రూ. 170 చేయనున్నట్లు వినికిడి.