KTR Landon Tour: లండన్‌లో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం.. యూకే లోనే 4 రోజులు..
KTR Landon Tour: యునైటెడ్ కింగ్ డమ్, దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది.
KTR Landon Tour: యునైటెడ్ కింగ్ డమ్, దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యూకే కి చెందిన టిఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు, పలువురు మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికారు. యూకేలో నాలుగు రోజులపాటు పర్యటనకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో లండన్ విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో సైతం విమానాశ్రయానికి చేరుకుని కేటీఆర్ కి పూల గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ తో ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ బుధవారం నుంచి అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్ కి లండన్ లో స్వాగతం పలికారు.
Many thanks for the welcome Andrew ? https://t.co/9eRXyXuLNz
ఇవి కూడా చదవండి— KTR (@KTRTRS) May 17, 2022