AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఆట కోసం.. థాయిల్యాండ్‌ వెళ్లిన 80 మంది భారతీయులు.. కట్ చేస్తే, దిమ్మతిరిగే షాక్..

జూదం ఓ వ్యసనం.. ఆడితే కిక్కిస్తుంది.. గెలిస్తే ఇంకా ఆడేలా చేస్తుంది.. ఓడినా.. కసితీరా ఆడేలా చేస్తుంది.. జూదానికి వ్యసనమైతే.. ఊరు.. వాడ.. రాష్ట్రం.. దేశం.. అనే సరిహద్దులే ఉండవు.. ఎక్కడికైనా వెళ్లి ఆడాల్సిందే.. లక్షలు పొగొట్టుకోవాల్సిందే. తాజాగా.. థాయిల్యాండ్‌కు వెళ్లి అక్కడ జూదం ఆడుతున్న భారతీయ గ్యాంబర్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ ఆట కోసం.. థాయిల్యాండ్‌ వెళ్లిన 80 మంది భారతీయులు.. కట్ చేస్తే, దిమ్మతిరిగే షాక్..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 01, 2023 | 12:57 PM

Share

జూదం ఓ వ్యసనం.. ఆడితే కిక్కిస్తుంది.. గెలిస్తే ఇంకా ఆడేలా చేస్తుంది.. ఓడినా.. కసితీరా ఆడేలా చేస్తుంది.. జూదానికి వ్యసనమైతే.. ఊరు.. వాడ.. రాష్ట్రం.. దేశం.. అనే సరిహద్దులే ఉండవు.. ఎక్కడికైనా వెళ్లి ఆడాల్సిందే.. లక్షలు పొగొట్టుకోవాల్సిందే. తాజాగా.. థాయిల్యాండ్‌కు వెళ్లి అక్కడ జూదం ఆడుతున్న భారతీయ గ్యాంబర్లను పోలీసులు అరెస్టు చేశారు. పటాయాలో 80 మంది భారతీయులను అరెస్టు చేసినట్లు థాయ్‌ పోలీసులు తెలిపారు. పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన దాడిలో ఎనభై మంది భారతీయ జూదగాళ్లు అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంగ్ లాముంగ్ జిల్లాలోని టాంబోన్ నాంగ్ ప్రూలోని సోయి ఫ్రా తమ్నాక్ 4లోని ఆసియా పట్టాయా హోటల్‌లో అర్ధరాత్రి సమయంలో దాడి జరిగిందని చోన్ బురి పోలీసు చీఫ్ పోల్ మేజర్ జనరల్ కాంపోల్ లీలాప్రపపోర్న్ తెలిపారు. ఏప్రిల్ 27-మే 1 వరకు హోటల్‌లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని.. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్‌ల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపారు.

పోలీసులు వచ్చి చూసేసరికి సంపావో గదిలో పెద్ద సంఖ్యలో జూదగాళ్లు బక్కరా, బ్లాక్‌జాక్‌లు ఆడుతూ కనిపించారన్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్‌లాండ్‌లు, నలుగురు మయన్మార్ జాతీయులు సహా మొత్తం 93 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 16 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

అరెస్టయిన 93 మందిలో 80 మంది భారతీయ జూదగాళ్లు కాగా మరికొందరు గేమ్ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. పోలీసులు నాలుగు బాకరాట్ టేబుల్స్, మూడు బ్లాక్‌జాక్ టేబుల్స్, 25 సెట్ల కార్డ్‌లు, 209,215,000 చిప్స్, 160,000 ఇండియన్ రూపీస్, ఎనిమిది క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్‌లు, మూడు నోట్‌బుక్ కంప్యూటర్లు, ఒక ఐప్యాడ్, మూడు కార్డ్ డీలర్ మెషీన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

గ్యాంబ్లింగ్ క్రెడిట్‌లు నమోదు చేసిన లాగ్‌బుక్, సుమారు 1,000 మిలియన్ రూపాయల విలువైన క్రెడిట్‌లను చెలామణిలో ఉన్నట్లు చూపిస్తుందని.. దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

32 ఏళ్ల సిత్రనన్ కేవ్‌లోర్ దీనిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భారతీయ పర్యాటకులు ఒక్కొక్కరికి నుంచి 50,000 భాట్ వసూలు చేసినట్లు వెల్లడించారు. జూదం కోసం గదిని 120,000 భాట్‌లకు అద్దెకు తీసుకున్నారన్నారు.

దాదాపు రూ.100 కోట్ల రూపాయల బెట్టింగ్‌ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏప్రిల్‌ 27 నుంచి ఆ హోటల్‌లో గ్యాంబ్లింగ్‌ సాగుతోందని.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..