Earthquake: న్యూజిలాండ్‌లో 6.9 తీవ్రతతో భూకంపం..ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన ప్రజలు..
బలమైన గాలుల కారణంగా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది విమానాలు రద్దయ్యాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
టర్కీ, సిరియాలో వినాశకరమైన భూకంపాల తరువాత, అనేక ఇతర దేశాల్లో కూడా నిరంతర భూకంపాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. భూకంపం ధాటికి న్యూజిలాండ్ భూమి మరోసారి దద్దరిల్లింది. న్యూజిలాండ్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. మార్చి 4వ తేదీ శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల కేంద్రంగా భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూమి కంపించడంతో భయంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. 252 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని.. భూకంప తీవ్రత 500 కిలోమీటర్ల వరకు ఉందని పేర్కొంది. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని.. స్థానిక అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సునామీ హెచ్చరికలు కూడా ఏమీ లేవని పేర్కొంది.
గత నెలలో కూడా న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 15 మధ్యాహ్నం న్యూజిలాండ్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు సంభవించినట్లు భూకంప కార్యకలాపాల పర్యవేక్షణ సంస్థ EMSC తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
గత నెలలో గాబ్రియెల్ హరికేన్ కారణంగా న్యూజిలాండ్ చాలా నష్టపోయింది. తుపాను కారణంగా, భారీ వర్షాల తర్వాత అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. వరదల కారణంగా చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బలమైన గాలుల కారణంగా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది విమానాలు రద్దయ్యాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ..