Nazi: 100 ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై ఇప్పుడు విచారణ…

ఎప్పుడో వంద ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై జర్మనీలో ఇక విచారణ ప్రారంభం కానుంది. వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విచారణ మొదలవుతుందని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. నిందితుల్లో ఓ మహిళ వయస్సు ఇప్పుడు 96 ఏళ్ళు కాగా..

Nazi: 100 ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై ఇప్పుడు విచారణ...
100 Year Old Nazi Concentration Camp Guard Tobe Tried
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2021 | 2:24 PM

ఎప్పుడో వంద ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై జర్మనీలో ఇక విచారణ ప్రారంభం కానుంది. వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విచారణ మొదలవుతుందని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. నిందితుల్లో ఓ మహిళ వయస్సు ఇప్పుడు 96 ఏళ్ళు కాగా..మాజీ గార్డు వయస్సు సుమారు 100 ఏళ్ళు.. ఈ వృద్దురాలికి 10 వేలకు పైగా హత్యలతోను, వృద్దుడికి మూడున్నర వేలకు పైగా మర్దర్లతోను ప్రమేయం ఉందట. కానీ వంద ఏళ్ళు వచ్చినా ఈ వ్యక్తి దాదాపు రెండున్నర గంటల పాటు కోర్టులో నిలబడగలడని, అతని ఫిట్ నెస్..ఆరోగ్యం అలా ఉన్నాయని జర్మనీలోని నెరుప్పిన్ లో గల ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు అతని మెడికల్ ఫిట్ నెస్ తాలూకు రిపోర్టు గత ఫిబ్రవరిలోనే అందినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు. కోర్టులో ప్రతి రోజూ రెండున్నర గంటల పాటు విచారణ జరుగుతుందని వారు చెప్పారు. 1942-1945 మధ్య కాలంలో బెర్లిన్ లోని సాచెన్ హ్యూసన్ క్యాంప్ లో జరిగిన ఖైదీల హత్యల్లో ఈ మాజీ గార్డుకు ప్రత్యక్షంగా సంబంధం ఉందని వీరు పేర్కొన్నారు.

నాటి సోవియట్ యుద్ధ ఖైదీలపై కాల్పులు జరపడమేగాక.. జైక్లాన్-బీ అనే విష వాయువును ప్రయోగించి వారి దారుణ మరణానికి కారకుడయ్యాడన్న అభియోగాలు ఇతనిపై ఉన్నాయి. జర్మనీ ప్రైవసీ చట్టాల ప్రకారం ఈ నిందితుల పేర్లను వెల్లడించరాదట. ఫిర్యాదు చేసినవారిలో అనేక మంది వృద్దులయ్యారని, కానీ తమకు న్యాయం జరగాలని, నిందితులను శిక్షించాలని వీరంతా కోరుతున్నారని బాధితుల తరఫు లాయర్ థామస్ వాల్డర్ తెలిపారు. ముఖ్యంగా 1936-1945 మధ్య కాలంలో నాజీల క్యాంపుల్లోని 20 వేలమందికి పైగా ఖైదీల్లో చాలామంది ఆకలి బాధతోనో, వ్యాధుల కారణంగానో చనిపోగా..మిగిలినవారిని అధికారులు ఉరి తీసి గానీ, విష ప్రయోగం ద్వారా గానీ చంపేశారు. ఈ కేసుల్లో 96 ఏళ్ళ వృద్దురాలిపై వచ్చే నెలలో కోర్టు విచారణ జరగనుంది. స్టాఫ్ కాన్సెంట్రేషన్ క్యాంప్ కమాండెంట్ కు ఆ నాడు ఈమె సెక్రటరీగా పని చేసిందట. నాజీ క్యాంపు వర్గాలకు ఎవరు సహకరించినా ఇప్పుడు శిక్ష పడవలసిందేనని ప్రాసిక్యూటర్లు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : పోయి పనిచూసుకోమన్న కేంద్రం..!మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )

 ఛాయ్‌ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.

 వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.

 తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్యం.. పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది..!:Motherfeed video.