Explainer: సింక్ హోల్స్.. మనుషుల ప్రాణాలను మింగేస్తాయి
సింక్ హోల్. ప్రస్తుతం మలేషియా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పదమిది. ఈ నెల 23న ఓ తెలుగు మహిళను మింగేసిన సింక్ హోల్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ.. కొన్నాళ్ల కిందట తన భర్త, కుమారుడితో కలిసి.. బతుకుదెరువు కోసం కౌలాలంపూర్ కు వెళ్లింది. అక్కడే పూసల బిజినెస్ లో భాగంగా.. ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తోంది.
సింక్ హోల్. ప్రస్తుతం మలేషియా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పదమిది. ఈ నెల 23న ఓ తెలుగు మహిళను మింగేసిన సింక్ హోల్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ.. కొన్నాళ్ల కిందట తన భర్త, కుమారుడితో కలిసి.. బతుకుదెరువు కోసం కౌలాలంపూర్ కు వెళ్లింది. అక్కడే పూసల బిజినెస్ లో భాగంగా.. ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తోంది. కుప్పం పరిధిలో ఉన్న కొన్ని కుటుంబాలు.. ఫ్యాన్సీ వస్తువులను కొని.. కౌలాలంపూర్ వెళ్లి అక్కడ.. వాటితో వ్యాపారం చేస్తుంటారు. విజయలక్ష్మి కూడా ఇలాగే బిజినెస్ చేయడానికి వెళ్లారు. ఆమె ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అక్కడున్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. సింక్ హోల్ ఏర్పడింది. అది గమనించకపోవడంతో ఆమె దాదాపు 8 మీటర్ల లోతులో ఉన్న ఆ సింక్ హోల్ లో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆమె భర్త, కుమారుడు బయటపడ్డారు. విజయలక్ష్మి ఆచూకీ కనిపెట్టడానికి అక్కడి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం లేదు. అయితే అక్కడ కురుస్తున్న భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయినా సరే.. పోలీసులు, ఫైర్ సర్వీస్, రెస్క్యూ విభాగం, సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఇంకా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. 17 గంటల పాటు తీవ్రంగా గాలించిన తరువాత ఆమె చెప్పులను మాత్రమే కనుక్కోగలిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కోట్ల ఆస్తిని అమ్మేసిన పూరి ??
అదే జైలులో.. అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా
Chiyaan Vikram: రెబల్ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన చియాన్
Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్