అదే జైలులో.. అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా

పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించే విషయమై అధికారులు సీఎంకు సమాచారం అందించారు. కోర్టు అనుమతి తీసుకుని అతడిని తరలిస్తున్నట్లు సమాచారం. దర్శన్ విల్సన్ గార్డ్ నాగ సహా 18 మంది నిందితులను బళ్లారి సెంట్రల్ జైలు, బెల్గాం హిండలగ జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదట దర్శన్‌ను బెల్గాంలోని హిండలగ జైలుకు తరలించనున్నట్లు నిన్న వార్తలు వచ్చాయి.

అదే జైలులో.. అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా

|

Updated on: Aug 29, 2024 | 12:50 PM

పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించే విషయమై అధికారులు సీఎంకు సమాచారం అందించారు. కోర్టు అనుమతి తీసుకుని అతడిని తరలిస్తున్నట్లు సమాచారం. దర్శన్ విల్సన్ గార్డ్ నాగ సహా 18 మంది నిందితులను బళ్లారి సెంట్రల్ జైలు, బెల్గాం హిండలగ జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదట దర్శన్‌ను బెల్గాంలోని హిండలగ జైలుకు తరలించనున్నట్లు నిన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బళ్లారి సెంట్రల్ జైలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అట్ట బళ్లారిలోని జైలులో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శన్ ను ఏ క్షణంలోనైనా తీసుకురావచ్చని బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు అప్రమత్తమై జైలులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక 9 బ్యారక్‌లున్న బళ్లారి జైలులో ప్రస్తుతం 385 మంది ఖైదీలు ఉన్నారు. సీసీ కెమెరాలతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కోర్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. జైల్లో అటాచ్డ్ బాత్‌రూమ్ ఉన్న సెల్స్ ఉన్నాయని, దర్శన్‌ను అవే సెల్స్‌లో ఉంచనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బళ్లారి జైలు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఒకప్పుడు అదే జైలులో దర్శన్ తన చౌక్ సినిమా షూటింగ్ చేశాడు. అందులో ఖైదీగా నటించి అలరించాడు. కానీ ఇప్పుడు అదే జైలుకు నిజమైన ఖైదీగా వెళ్తున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiyaan Vikram: రెబల్‌ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన చియాన్

Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్

తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

 

Follow us