తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఖుష్బూ సుందర్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారామె. ఖుష్బూ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారీ అందాల తార.

తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

|

Updated on: Aug 29, 2024 | 12:42 PM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఖుష్బూ సుందర్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారామె. ఖుష్బూ అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారీ అందాల తార. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ స్పెషల్ రోల్స్ లో సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అలాగే నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇక ఈక్రమంలోనే తాను తీవ్రంగా గాయపడ్డానంటూ.. చెప్పి తన ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ బీజీగా ఉండే ఖుష్బూ.. రీసెంట్గా తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ఎక్స్‌లో ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో.. ఆమె మోకాలికి కట్టుతో కనిపించారు. ఆ ఫోటోతో పాటు వెన్ యూ హావ్‌ యువర్‌ బెస్టీ టూ గార్డ్‌ యూ.. అంటూ రాసుకొచ్చారు. అయితే అసలు ఏం జరిగింది? తన గాయానికి కారణాలేంటి? ఏం ప్రమాదం జరిగింది? అన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు ఖుష్బూ. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారామె.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

అందానికైన ముద్దొస్తుంది ఈ క్యూటీ బొమ్మ.. మెస్మేరైజ్ చేస్తున్న కోమలి..

భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు

Follow us