ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు వారిపై నిఘా పెట్టినప్పటికీ.. రోజుకో రూపంలో తమ పంజా విసురుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ షంషేర్గంజ్ ఎస్బీఐ బ్యాంకును సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. ఎస్బీఐ బ్యాంకులో దాదాపు 175 కోట్ల రూపాయిల అక్రమ లావాదేవీలను అధికారులు గుర్తించారు.

ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

|

Updated on: Aug 29, 2024 | 12:39 PM

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు వారిపై నిఘా పెట్టినప్పటికీ.. రోజుకో రూపంలో తమ పంజా విసురుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ షంషేర్గంజ్ ఎస్బీఐ బ్యాంకును సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. ఎస్బీఐ బ్యాంకులో దాదాపు 175 కోట్ల రూపాయిల అక్రమ లావాదేవీలను అధికారులు గుర్తించారు. మొత్తం ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా ఈ లావాదేవీలను సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేశారు. 2 నెలల్లో 6 అకౌంట్ల ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు జరిపినట్లు క్రైమ్ బ్యూరో గుర్తించింది. సైబర్ నేరగాళ్ళ కోసం ఆరు అకౌంట్లు తెరిచారు ఆరుగురు హైదరాబాదీలు. సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహ్మద్ షాహిబ్, బిన్ హమాద్ లను అరెస్ట్ చేసింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. వీరిద్దరూ ఈ అకౌంట్ల నుంచి హవాలా ద్వారా దుబాయ్ కి డబ్బుని ట్రాన్స్ ఫర్ చేశారు. రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా 175 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్లో డిపాజిట్లు చేశారు. ఈ 6 అకౌంట్లకు 600 కంపెనీలతో లింకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందానికైన ముద్దొస్తుంది ఈ క్యూటీ బొమ్మ.. మెస్మేరైజ్ చేస్తున్న కోమలి..

భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు

Follow us