Rajinikanth: డీఎంకేని ఎవరూ కూల్చలేరంటూ తలైవా కామెంట్స్‌.. విజయ్ ఫ్యాన్స్‌ ఆగ్రహం

తలైవా తాజాగా చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిదని.. దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొనే శక్తి ఈ పార్టీకి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు.

Rajinikanth: డీఎంకేని ఎవరూ కూల్చలేరంటూ తలైవా కామెంట్స్‌.. విజయ్ ఫ్యాన్స్‌ ఆగ్రహం

|

Updated on: Aug 29, 2024 | 12:37 PM

తలైవా తాజాగా చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిదని.. దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొనే శక్తి ఈ పార్టీకి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్… కరుణానిధి గురించి అరగంటసేపు మాట్లాడారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని రజినీకాంత్ కొనియాడారు. ఎ.వి.వేలు రచించిన కలైంగర్‌ ఎనుమ్‌ తాయ్‌ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.రజినీకాంత్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలను ఉద్దేశించి తలైవా చేసిన వ్యాఖ్యలను మరో స్టార్‌ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోలీవుడ్ స్టార్‌హీరో, దళపతి విజయ్‌ ఇటీవలే తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్.. విజయ్‌ పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సూపర్‌స్టార్‌ ప్రస్తుతం వెట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు

Follow us