Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్

బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన కామెంట్లు, ట్వీట్లతో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా రైతు ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే దీనిపై కలగజేసుకుని కంగనాకు అక్షింతలు వేశారు. ఇప్పుడు కంగనాకు ఏకంగా హత్యా బెదిరింపులు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆమె నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా.

Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్

|

Updated on: Aug 29, 2024 | 12:43 PM

బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తన కామెంట్లు, ట్వీట్లతో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా రైతు ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే దీనిపై కలగజేసుకుని కంగనాకు అక్షింతలు వేశారు. ఇప్పుడు కంగనాకు ఏకంగా హత్యా బెదిరింపులు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆమె నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా. ఈ సినిమాలో.. కంగన.. దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సినిమా విడుదల చేయకూడదని పట్టుబడుతున్నాయి కొన్ని సిక్కు వర్గాలు. తమ మాట వినకుండా మూవీని రిలీజ్ చేస్తే చంపేస్తామని కంగనాను బెదిరిస్తున్నాయట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

ఎస్ బీఐని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

అందానికైన ముద్దొస్తుంది ఈ క్యూటీ బొమ్మ.. మెస్మేరైజ్ చేస్తున్న కోమలి..

భార్య ఖర్చులు భరించలేక.. ‘రోడ్డు ప్రమాదం’లో చంపేశాడు

Follow us